Bigg Boss 5 : బిగ్ బాస్ 5 : అదిరిపోయే బీఎండబ్ల్యూ బైక్ కొనేసిన కాంట్రవర్షియల్ బ్యూటీ.!

Bigg Boss 5 : తెలుగు బుల్లితెర దగ్గర కొన్ని మోస్ట్ పాపులర్ షోలు ఉన్న సంగతి తెలిసిందే.. వాటిలో అతి పెద్ద రియాలిటీ షో ల లిస్ట్ తీస్తే మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ ప్లేస్ లో నిలిచే షో “బిగ్ బాస్”. ప్రపంచ వ్యాప్తంగా కూడా ఎంతో పాపులర్ అయ్యిన షో తెలుగులో భారీ రెస్పాన్స్ తో దూసుకెళ్తుంది.

మరి ఈ షో తెలుగులో మొత్తం ఐదు సీజన్లను ఇప్పటి వరకు కంప్లీట్ చేసుకుంది. గత డిసెంబర్ లోనే ఐదవ సీజన్ ని పూర్తి చేసుకున్న ఈ షోలో కూడా ముందు సీజన్ల లానే కొంతమంది లేడీ కంటెస్టెంట్స్ కి మంచి క్రేజ్ తో పాటు కాంట్రవర్సీ లు కూడా ఎదురయ్యాయి.

అలాంటి ఒక కాంట్రవర్షియల్ బ్యూటీనే అదిరిపోయే బిఎండబ్ల్యు స్పోర్ట్స్ బైక్ ని కొనేసింది. ఆమె మరెవరో కాదు ఈ బిగ్ బాస్ హౌస్ లో రవి తో జరిగిన ఇష్యూ పై హైలైట్ అయ్యిన లహరి శరీ. మరి ఈమెనే ఇప్పుడు హైదరాబాద్ లో బీఎండబ్ల్యూ జి 310 జిఎస్ బైక్ ని డెలివరీ తీసుకుంది.

అయితే ఈ బైక్ చూడడానికి సూపర్ స్టైలిష్ గానే ఉన్నా ధర కూడా అంతే సాలీడ్ గా కూడా ఉంది. దీనిని ఆమె ఏకంగా మూడున్నర లక్షలు పెట్టి కొన్నదట. ఇప్పుడు ఇదే ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.