Bigg Boss 5 Telugu : మన తెలుగు బుల్లితెర వద్ద అతి పెద్ద రియాలిటీ షో అయినటివంటి బిగ్ బాస్ కోసం అందరికీ తెలిసిందే. గత డిసెంబర్ లోనే ఈ షో ఫైనల్స్ ని కూడా కంప్లీట్ చేసుకొని మొత్తం 5 సీజన్లను కంప్లీట్ చేసుకుంది. ఇక ఇప్పుడు బిగ్ బాస్ 6 సహా ఓటిటి వెర్షన్ లని కూడా మేకర్స్ సిద్ధం చేస్తుండగా ఓ షాకింగ్ న్యూస్ బిగ్ బాస్ వీక్షకులకు తగిలింది.
ఈ సారి సీజన్లో లాస్ట్ చేసి కాస్త కాంట్రవర్సీ గా మరీనా కంటెస్టెంట్ అయినటువంటి లేడీ కంటెస్టెంట్ సిరి కరోనా పాజిటివ్ అయ్యినట్టుగా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్నీ తన ఇన్స్టాగ్రామ్ లో తెలియజేసింది. తాను కొద్ది పాటి లక్షణాలతో పాజిటివ్ అయ్యానని సింపుల్ గా చెప్పుకొచ్చింది.
మరి లాస్ట్ చేసి సిరి మరియు తన తోటి మరో ఫైనలిస్ట్ కంటెస్టెంట్ షణ్ముఖ్ జస్వంత్ ల కెమిస్ట్రీ ఎంత దూరం వెళ్లిందో అందరికీ తెలిసిందే. అలాగే ఈ ఇద్దరి కెమిస్ట్రీ నే షణ్ముఖ్ మరియు మరో యూట్యూబ్ స్టార్ దీప్తి సునైనా ల బ్రేకప్ కి కారణం అని టాక్ కూడా ఉంది.
అది నిజమే అన్నట్టుగా షన్ను మరియు సిరి లు కూడా బిగ్ బాస్ నుంచి బయటకి వచ్చిన తర్వాత నడుచుకున్న తీరు అందరిలో మరింత వెగటు తెప్పించింది. మరి మొత్తానికి అయితే సిరి కరోనా పాజిటివ్ వార్త ఇప్పుడు బిగ్ బాస్ వీక్షకుల్లో హాట్ టాపిక్ గా మారింది.