మాహారాష్ట్రకీ, దేశంలోని ఇతర రాష్ట్రాలకీ మధ్య రాకపోకలు యధాతథంగా నడుస్తున్నాయి. కానీ, మహారాష్ట్రలో నమోదవుతున్న స్థాయిలో ఇతర రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంలేదు. ఎందుకట.? తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే, ఆంద్రపదేశ్‌లోని విశాఖపట్నంలో 405 కరోనా పాజిటివ్ కేసులు నేడు నమోదైతే, ఆ పక్కనే వున్న తూర్పుగోదావరి జిల్లాలో 50 కేసులు కూడా నమోదు కాలేదు. పశ్చిమగోదావరి జిల్లాలో 40 కేసులు నమోదైతే, ఆ పక్కనున్న కృష్ణా జిల్లాలో 306 కేసులు నమోదయ్యాయి. ఏంటీ మ్యాజిక్.? ఇదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. తమిళనాడులో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది కాబట్టి, బోర్డర్ జిల్లా చిత్తూరులో 700 పైబడి కేసులు నమోదవుతుండడాన్ని కొంతవరకు సమర్థించవచ్చేమో. కానీ, జిల్లాల మధ్య.. రాష్ట్రాల మధ్య ప్రజా రవాణాకి ఎలాంటి ఆంక్షలు లేనప్పుడు, ఓ ప్రాంతంలో ఒకలా, ఇంకో ప్రాంతంలో ఇంకొకలా కరనా వైరస్ ఎందుకు వ్యవహరిస్తోంది.? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
కేసులు ఎక్కువ పెరగాలని ఎవరూ కోరుకోరు. కానీ, ఓ చోట ఎక్కువ.. ఇంకో చోట తక్కువ.. వెనుక అసలు మతలబు ఏంటన్నదే ఇక్కడ చర్చ. దేశం, కోవిడ్ వ్యాక్సిన్ మహోత్సవానికి సిద్ధమయ్యింది.. నేడే ఆ కార్యక్రమం ప్రారంభమైంది. చిత్రంగా దేశంలో కరోనా వైరస్ వ్యాక్సిన్ కొరత ఏర్పడింది. చాలా రాష్ట్రాల్లో వ్యాక్సిన్ అవసరమైన మేర అందుబాటులో లేకుండా పోయింది. ఎందుకిలా.? ఈ ప్రశ్నలకు ప్రభుత్వాల దగ్గర సమాధానం దొరకడంలేదు. ఏదో తెరవెనుక కథ నడుస్తోంది కరోనా విషయంలో. అదేంటన్నది తేల్చాల్సింది కేంద్ర ప్రభుత్వమే.