Bheemla Nayak : ‘భీమ్లానాయక్’కి ఇంత అవమానమా.?

Bheemla Nayak : ఔను, ‘భీమ్లానాయక్’ సినిమాకి అవమానం జరిగింది.. ఇదే చర్చ ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో జరుగుతోంది. కోవిడ్ 19 పాండమిక్ నేపథ్యంలో అన్ని సినిమాల విడుదలలూ ఇబ్బందుల్లో పడ్డాయి. చాలా సినిమాల నిర్మాణం ఇబ్బందుల్లో పడిన విషయం అందరికీ తెలిసిందే.

‘అఖండ’, ‘పుష్ప’ ఎలాగోలా థియేటర్లలోకి వచ్చేశాయి, మంచి విజయాల్ని అందుకున్నాయి. సంక్రాంతి సినిమాల విషయంలోనే ఇంకా గందరగోళం కొనసాగుతూనే వుంది. ‘భీమ్లానాయక్’ సినిమాని రేసులోకి తప్పించడం ద్వారా ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’ ఊపిరిపీల్చుకున్నాయి.

అయితే, ఇక్కడ ‘భీమ్లానాయక్’ సినిమాని ఎందుకు అవమానించాల్సి వచ్చింది.? అన్న విషయమై తెలుగు సినీ పరిశ్రమలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ‘కొందరి ఇగోని శాటిస్‌ఫై చేయడం కోసమే ఈ ప్రయత్నం.. ఆ కొందరి ఇగో సంతృప్తి చెందింది.. వాళ్ళ ప్రయత్నాలూ ఫలించాయి..’ అంటూ సినీ పరిశ్రమలో పలువురు చర్చించుకుంటున్నారు.

కాగా, ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’ సినిమాలకు టిక్కెట్ ధరల్ని పెంచుకోవడం అలాగే బెనిఫిట్ షోలు వేసుకోవడం వంటివాటికి కూడా ఆంధ్రప్రదేశ్‌లో లైన్ క్లియర్ కాబోతోందట. ఇదంతా కేవలం ‘భీమ్లానాయక్’ సినిమాని రేసులోంచి తప్పించడం ద్వారానే సాధ్యమయ్యిందనీ, ఓ ప్రముఖ నిర్మాత ఈ మొత్తం వ్యవహారంలో కథ నడిపించారనీ సినీ, రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంటున్నారు.. సోషల్ మీడియాలో సదరు ప్రముఖ నిర్మాతని ఏకిపారేస్తున్నారు. మరి, ఈ వాదనలో నిజమెంతో వేచి చూడాల్సిందే.