Naga Chaitanya: నాగచైతన్యను కృష్ణుడితో పోల్చిన బంగార్రాజు డైరెక్టర్!

Naga Chaitanya: అక్కినేని నాగచైతన్య తన తండ్రి నాగార్జునతో కలిసి సోగ్గాడే చిన్నినాయన సినిమాకి సీక్వెల్ చిత్రంగా బంగార్రాజు చిత్రంలో నటించిన సంగతి మనకు తెలిసిందే.ఎన్నో అంచనాల నడుమ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి టాక్ సంపాదించుకుంది.ఇదిలా ఉండగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ నాగచైతన్య గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కళ్యాణ్ కృష్ణ మాట్లాడుతూ ఈ పండుగ కోసం ఈ సినిమాను తీసుకురావాలని ఎంతో కష్టపడ్డామని తెలిపారు.

అయితే ఈ సినిమాను నాగార్జున గారి పై నమ్మకంతో ముందుకు తీసుకెళ్ళామని, ఆయనే మా కెప్టెన్ అంటూ నాగార్జున ప్రశంసలు కురిపించారు.ఈ సినిమాలో ఈ పాత్రకు నాగార్జున తప్ప మరెవరు సెట్ కాదని కళ్యాణ్ కృష్ణ నాగార్జున గురించి మాట్లాడారు. అదే విధంగా నాగచైతన్య గురించి కళ్యాణ్ కృష్ణ మాట్లాడుతూ ఎన్నో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా చైతన్య గురించి ఆయన మాట్లాడుతూ చైతన్య 48 క్యారెట్స్ బంగారం అని తెలిపారు. నాగచైతన్య ఇప్పటి వరకు రాముడు పాత్రలో నటించినప్పటికీ ఈ సినిమాలో మాత్రం కృష్ణుడి పాత్రలో నటించారని తెలిపారు. ఎంతో చిలిపిగా అందరినీ ఆటపట్టిస్తూ నాగచైతన్య మాస్ లుక్ లో ప్రతి ఒక్కరిని సందడి చేశారని కళ్యాణ్ కృష్ణ నాగ చైతన్య గురించి తెలియజేశారు.