Bandla Ganesh: త్రివిక్రమ్ ను బండ బూతులు తిట్టిన బండ్లగణేష్.. వైరల్ అవుతున్న ఆడియో లీక్..!

Bandla Ganesh: బండ్ల గణేష్ టాలీవుడ్ ఇండస్ట్రీలో పరిచయం అవసరం లేని పేరు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మొదలై ప్రస్తుతం ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. నటుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా ఒక బిజినెస్ మాన్ గా కూడా అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పలువురు టాలీవుడ్ ప్రముఖ హీరోలతో సినిమాలు చేసి నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇదిలా ఉండగా బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని. ఛాన్స్ దొరికితే చాలు పవన్ కళ్యాణ్ మీద తనకున్న అభిమానాన్ని అందరితో పంచుకుంటారు.

తాజాగా భీమ్లా నాయక్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ పోస్ట్ పోన్ అయిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. తరచూ వార్తల్లో నిలిచే బండ్ల గణేష్ ఈ సందర్భంగా మరొకసారి వార్తల్లో నిలిచారు. బండ్ల గణేష్ మాట్లాడిన ఒక ఆడియో లీక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. లీక్ అయిన ఆడియోలో ఒక అభిమాని ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెళ్తున్నారా? స్పీచ్ రెడీ చేసుకున్నారా? అని అడగగా.. బండ్ల గణేష్ స్పందిస్తూ “త్రివిక్రమ్ నన్ను రావద్దన్నడు. నాకు వెళ్లాలని ఉన్నా వాళ్ళు పిలవకపోతే ఎలా వెళ్లాలి అని మాట్లాడాడు. త్రివిక్రమ్ నేను రాకుండా ముందే ప్లాన్ చేశాడు”అని చెప్పుకొచ్చారు.

YouTube video player

ఇదిలా ఉండగా ఈ ఆడియో ఎంత వరకు నిజం అన్న దానిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా ఈ విషయంపై బండ్లగణేష్ స్పందిస్తూ ఆడియోలో ఉన్న వాయిస్ తనది కాదు అంటూ ఈ విషయాన్ని కొట్టిపడేశారు. ఒకవేళ అ ఈ ఆడియోలో ఉన్న వాయిస్ బండ్ల గణేష్ ది కాకపోతే ఈ ఆడియో ఎవరు వైరల్ చేశారు? బండ్ల గణేష్ ని టార్గెట్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది అని కొత్తగా అనుమానాలు రేకెత్తుతున్నాయి.ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ విషయం గురించి ఏమైనా ప్రస్తావన వస్తుందేమో వేచి చూడాలి మరి.