Ashu Reddy: చిరిగిన చొక్కాతో అషు రెడ్డి… కుక్కలు చింపాయ అంటూ నెటిజన్ కామెంట్…. ఫోటో వైరల్!

Ashu Reddy: బిగ్ బాస్ సీజన్ 3 తో అషు రెడ్డి బాగా ఫేమస్ అయింది. అంతకుముందు డబ్ స్మాష్ వీడియోలు చేస్తూ సమంత డూప్ లాగా అందరికి తెలిసిన అషు రెడ్డి బిగ్ బాస్ తర్వాత జోరు పెంచి అవకాశాలని సద్వినియోగం చేసుకుంటోంది. ఈవెంట్స్ లోను టీవీ ప్రోగ్రామ్స్ తో రచ్చ చేస్తోంది. ఇవే కాకా అప్పుడప్పుడు ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో కూడారద్దు చేస్తూ నిత్యం ఏదో ఒక విషయం ద్వారా సోషల్ మీడియా వార్తల్లో నిలుస్తున్నారు.

రీసెంట్ గా రవితో బైక్ రైడ్ చేస్తూ చేసిన రీల్స్, ఫొటోస్ తెగ వైరల్ అయ్యాయి.ఇక ఇపుడు ఏకంగా తన డ్రెస్ వల్ల వైరల్ అవుతోంది. చిరిగిన డ్రెస్ వేసుకుని ఫోటో లకు పోజ్ ఇచ్చింది.టార్న్ డేనిమ్ జీన్స్ వేసుకుని ఈ అమ్మడు బ్యాక్ నుండి ఫోటో కి పోజ్ ఇచ్చిన ఫోటో కు కింద కాప్షన్ కూడా రాసుకొచ్చారు.చిరిగిన చొక్కా వేసుకో కానీ మంచి పుస్తకం కొనుక్కో అని ఒక పెద్ద మనిషి చెప్పారంటూ రాసింది. దీని పై చాలా మంది నెటిజన్స్ రకరకాలుగా రిప్లై ఇచ్చారు.

అందులో కొందరు డ్రెస్ ను వీధి కుక్కలు దాడి చేసి చింపేసాయా అని అడుగగా ఇంకొంతమంది చిరిగిన చొక్కా ధరించావు మరీ పుస్తకం కొనుకున్నావా ? అంటూ కామెంట్ చేసారు. చాలా మంది నెటిజన్స్ ఈ పోస్ట్ పై ట్రోల్ చేస్తున్నారు. ఇలా పలు అవకాశాలు ద్వారా ఎంతో బిజీగా మారిపోయిన అషు రెడ్డి ఫోకస్ అనే చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశాన్ని కూడా దక్కించుకున్నారు అదేవిధంగా ఓటీటీలో ప్రసారం కాబోతున్న బిగ్ బాస్ కార్యక్రమానికి కూడా ఈమె వెళ్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.