Arjun sarja : బాలకృష్ణతో తలపడుతున్న మరొక హీరో.. డైరెక్టర్ ప్లాన్ మామూలుగా లేదుగా!

Arjun sarja : దక్షిణాది సినీ పరిశ్రమలో యాక్షన్ సినిమాలు చేసి ‘ యాక్షన్ కింగ్ ‘ అని పేరు తెచ్చుకున్న హీరో అర్జున్ సర్జా . ఈయన కన్నడ , తమిళం , తెలుగు, మలయాళం , హిందీ భాషలలో హీరోగా నటించి అందరిని మెప్పించాడు. ప్రఖ్యాత కన్నడ నటుడు శక్తి ప్రసాద్ కొడుకుగా ఈయన సినీరంగ ప్రవేశం చేశారు.

టాలీవుడ్ పరిశ్రమలో అర్జున్ ఎన్నో సినిమాలలో హీరోగా నటించి అందరి అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. హీరోగా మాత్రమే కాకుండా విలన్ గా కూడా నటించి తన నటతో ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు . ఇప్పటి వరకు అర్జున్ సర్జా తన సినీ జీవితంలో 150 సినిమాలు మైలురాయిని అధిగమించాడు. ఇప్పటికే తెలుగులో ” లై ” ,” నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా ” చిత్రాలలో నటించారు. ప్రస్తుతం రవితేజ హీరోగా నటిస్తున్న ‘ ఖిలాడి ‘ సినిమాలో ప్రధాన పాత్రలో నటించనున్నారు.

క్రాక్ సినిమా మంచి హిట్ అవటం వల్ల ఫామ్ లోకి వచ్చిన గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న సినిమాలో అర్జున్ విలన్ పాత్రలో ప్రేక్షకులను అలరించబోతున్నారు అనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ హీరోగా , శృతిహాసన్ హీరోయిన్ గా , అర్జున్ పవర్ ఫుల్ విలన్ పాత్రలో నటిస్తున్నట్టు త్వరలో మేకర్స్ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించపోతున్నారు.. మొత్తానికి బాలకృష్ణ హీరోగా, అర్జున్ విలన్ గా ఈ సినిమాలో కనిపించబోతున్నారు.