Jogging: చలికాలంలో జాగింగ్ చేస్తున్నారా…ఇవి తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Jogging: ప్రస్తుత కాలంలో అందరికీ ఆరోగ్యం మీద శ్రద్ధ పెరిగింది. ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అటువంటివాటిలో వ్యాయామాలు కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. జాగింగ్ ,వాకింగ్ వంటి వ్యాయామాలు శరీర ఆరోగ్యాన్ని కాపాడటంలో ఎంతో ఉపయోగపడతాయి. కానీ శీతాకాలంలో జాగింగ్ చేయడం వల్ల చలికి ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

సాధారణంగా ప్రతిరోజు తెల్లవారుజామునే జాగింగ్ చేస్తూ ఉంటారు. శీతాకాలంలో చలికి తట్టుకోలేక చాలా మంది వాకింగ్, జాగింగ్ వంటి వ్యాయామాలు చేయరు. కానీ శీతాకాలంలో జాగింగ్ చేయడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

వేసవికాలంలో జాగింగ్ చేయడం వల్ల ఉష్ణోగ్రతకు శరీరం డీహైడ్రేషన్ చెంది తొందరగా అలసిపోతుంది. కానీ శీతాకాలంలో జాగింగ్ చేయడం వల్ల శరీరం తొందరగా డీహైడ్రేషన్ కు గురి అవ్వదు. శీతాకాలంలో చల్లని వాతావరణంలో పరిగెత్తడం వల్ల శరీరానికి తక్కువ శక్తి అవసరం అవుతుంది.
గుండె సంబంధిత వ్యాధులు ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు వేసవికాలంలో జాగింగ్ చేయడం వల్ల చెమట ఎక్కువగా వెలువడుతుంది. దీనివల్ల అనేక ఇతర ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి.

వేసవికాలంలో జాగింగ్ చేయడం వల్ల దాదాపు1.5 లీటర్ల శక్తి చెమట రూపంలో బయటకు వస్తాయి. దీని కారణంగా శరీరం డీహైడ్రేషన్ కి గురవుతుంది. అందువల్ల శీతాకాలంలో జాగింగ్ చేయడం ఆరోగ్యానికి చాలా ఉపయోగకరం. కానీ ఆస్మా వంటి సమస్యలు ఉన్నవారు శీతాకాలంలో జాగింగ్ చేయడం ప్రమాదకరం.