Bigg Boss : వైరల్ : ‘బిగ్ బాస్ 5’ విన్నర్ గా రవి చెప్తుంది అతడి పేరే.!

Bigg Boss : ప్రతి ఏడాది లానే ఈసారి తెలుగు బుల్లితెరపై అతి పెద్ద రియాలిటీ షో అయినటువంటి బిగ్ బాస్ ఈసారి కూడా సీజన్ 5 తో అదిరే ఎంటర్టైన్మెంట్ ని ఇన్ని రోజులు ఇచ్చి ఎట్టకేలకు ఫైనల్స్ కి వచ్చేసింది. గత వారం కాజల్ ఎలిమినేషన్ తో ఈ సీజన్ ఇప్పుడు లాస్ట్ స్టేజ్ కి వచ్చింది.

ఇక హౌస్ లో కేవలం టాప్ 5 కంటెస్టెంట్స్ మాత్రమే ఉండడంతో విన్నర్ ఎవరు అనే ప్రశ్న స్టార్ట్ అయ్యింది. అయితే నిజానికి ఈ ఫినాలే కంటెస్టెంట్ లిస్ట్ లో యాంకర్ రవి పేరు ఖచ్చితంగా ఉంటుందని చాలా మందే భావించారు. కానీ ఊహించని విధంగా ఫైనల్స్ కి రెండు వారాల ముందే రవి బిగ్ బాస్ హౌస్ నుంచి వైదొలిగాడు.

మరి ఇప్పుడు తాను ఈసారి బిగ్ బాస్ సీజన్ 5 గెలవడానికి ఎవరు సరైన కంటెస్టెంట్ అనేది తెలపడం వైరల్ అవుతుంది. ఈ సారి విన్నర్ గా శ్రీరామ చంద్ర అవ్వాలని అనుకుంటున్నానని తెలిపాడు. అందుకు అర్హత ఖచ్చితంగా శ్రీరామ్ కి ఉందని కూడా చెబుతున్నాడు. మరి ఫైనల్స్ లో తాను చెప్పిన కంటెస్టెంట్ నెగ్గుతాడా లేదా అనేది చూడాలి.