యాంకర్ రవి అతినే తనకు అవకాశాలు లేకుండా చేసాయా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫిమేల్ యాంకర్లుగా ఎంతోమంది గుర్తింపు పొందారు. అయితే ఇండస్ట్రీలో మేల్ యాంకర్స్ మాత్రం చాలా తక్కువ మందే ఉన్నారు. ఇలా మేల్ యాంకర్స్ గా గుర్తింపు పొందిన వారిలో ప్రదీప్, రవి పేరు ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. ప్రదీప్ ఇప్పటికీ వరుస టీవీ షోలలో యాంకర్ గా వ్యవహరిస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నాడు. అయితే రవి మాత్రం అవకాశాలు లేక ఖాళీగా ఉంటున్నట్లు తెలుస్తోంది. మ్యూజిక్ ఛానల్ లో యాంకర్ గా తన కెరీర్ ప్రారంభించిన రవి ఆ తర్వాత బుల్లితెర మీద ప్రసారమవుతున్న టీవీ షోలలో యాంకర్ గా వ్యవహరిస్తూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ పాపులర్ అయ్యాడు.

చాలాకాలం స్టార్ యాంకర్ గా కొనసాగిన రవి కి బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి వచ్చిన తర్వాత అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. సాధారణంగా బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొని బయటికి వచ్చిన వారికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ బిగ్ బాస్ హౌస్ లో రవి చేసిన ఓవరాక్షన్ వల్ల నెగెటివిటీ మూట కట్టుకొని బయటికి వచ్చాడు దీంతో ఇండస్ట్రీలో కూడా అతనికి యాంకర్ గా అవకాశాలు బాగా తగ్గిపోయాయి. అప్పుడప్పుడు టీవీ షోలలో యాంకర్ గా సందడి చేసినప్పటికీ మునపటిలా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి. అయితే ఇలా క్రమంగా రవికి అవకాశాలు తగ్గిపోవటానికి అతని ప్రవర్తనే కారణమంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

టీవీ షోలలో రవి చేసే ఓవరాక్షన్ గురించి అందరికీ తెలిసిందే. అంతేకాకుండా గతంలో లాస్యతో అసభ్యకరంగా ప్రవర్తించినట్లు ఆమె ఆరోపించింది. అంతేకాకుండా శ్రీముఖితో కలిసి యాంకరింగ్ చేసే సమయంలో కూడా ఆమెను కూడా తన ప్రవర్తనతో విసిగించినట్లు తెలుస్తోంది. ఇలా ఫిమేల్ యాంకర్స్ తో రవి వ్యవహరించే తీరు సరిగా లేకపోవడం వల్లనే అతనికి ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గిపోయాయని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే యాంకర్ రవి అంటే గిట్టని వారు అతని గురించి ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని అతని గురించి వినిపిస్తున్న వార్తల్లో నిజం లేదని రవి అభిమానులు కొట్టి పారేస్తున్నారు. అయితే రవి తన భార్యతో కలిసి యూట్యూబ్ ఛానల్ మీద ఫోకస్ చేయడం వల్లనే బుల్లితెర మీద కనిపించటం లేదని అతని అభిమానులు రవిని సమర్థిస్తున్నారు. అయితే రవి గురించి వినిపిస్తున్న ఈ వార్తలపై అతను ఎలా స్పందిస్తాడో చూడాలి మరి.