Anasuya Latest Photos: మరోసారి గ్లామరస్ ఫోటోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న రంగమ్మత్త.. ఫోటోలు వైరల్!

Anasuya Latest Photos: టాలీవుడ్ టెలివిజన్ ఇండస్ట్రీలో చాలా మంది ఫిమేల్ యాంకర్స్ ఉన్నారు . సుమ కనకాల తరువాత టాలీవుడ్ ఇండస్ట్రీలో గుర్తొచ్చే ఫిమేల్ యాంకర్ పేరు అనసూయ. అనసూయ భరద్వాజ్ గురించి తెలియని వారు ఉండరు అనటంలో సందేహం లేదు. బుల్లి తెరపై ఎన్నో షోస్ కి హోస్ట్ గా వ్యవహరి తన యాంకరింగ్ తో అందరిని ఆకట్టుకుంటున్నారు. మన రంగమ్మత్త యాంకర్ గా మాత్రమే కాకుండా వెండితెరపై క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన నటనతో అందరి అభిమానాన్ని సొంతం చేసుకుంది. అందం ,అభినయం రెండూ కలగలిపిన నటి ,యాంకర్ గా అనసూయ ఎంతో గుర్తింపు తెచ్చుకుంది.

జబర్దస్త్ ,భలే చాన్సులే ,మోడరన్ మహాలక్ష్మి , బిందాస్ , వంటి టీవీ షోలకు యాంకర్ గా వ్యవహరించి గుర్తింపు తెచ్చుకుంది. ప్రతి గురువారం ఈ టీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ ప్రోగ్రాం అనసూయకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ షో లో ఆది ,అనసూయ మద్య జరిగే సన్నివేశాలు అందరిని ఆకట్టుకున్నాయి.అనసూయ బుల్లితెర మీద యాంకర్ గా మాత్రమే కాకుండా వెండితెరపై కూడా తన నటనతో అందరిని మెప్పించింది. తన డాన్స్ పర్ఫార్మెన్స్ తో కూడా ఈ రంగమ్మత్త ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది.

నాగార్జున హీరోగా నటించిన సోగ్గాడే చిన్ని నాయన చిత్రంలో నటించి మంచి పేరు తెచ్చుకుంది. దాని తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ రామ్ చరణ్ హీరోగా నటించిన రంగస్థలం సినిమాలో అనసూయ రంగమ్మత్త క్యారెక్టర్ లో నటించింది. ఆ క్యారెక్టర్ వల్ల అనసూయ పేరు రంగమ్మత్త గా మారిపోయింది. ప్రస్తుతం తాజాగా విడుదలయిన పుష్ప సినిమాలో దాక్షాయని గా విలన్ పాత్ర పోషించింది. అనసూయ యాక్టర్ గా , యాంకర్ గా , మంచి డాన్సర్ గా , పేరు తెచ్చుకుంది న్యాయనిర్ణేతగా కూడా కొన్ని షోలకు వ్యవహరించింది. అటు ఫ్యామిలీని , ఇటు ప్రొఫెషన్ ని ఈక్వల్ గా హ్యాండిల్ చేస్తూ ఉంది.తాజాగా అనసూయ కొన్ని లేటెస్ట్, గ్లామరస్ ఫోటోలను షేర్ చేయడంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారి, సోషల్ మీడియా ను షేక్ చేస్తున్నాయి.