Anasuya: దాక్షాయణిలా ఉందంటూ.. అనసూయ పరువు తీసిన సుమ..!

Anasuya: అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బుల్లితెర మీద అనసూయ చేసే సందడి అంతా ఇంతా కాదు. టెలివిజన్ లో ప్రసారమయ్యే ఎన్నో టీవీ షోస్ కి యాంకర్ గా వ్యవహరించింది. ప్రస్తుతం ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ ప్రోగ్రాంకి అనసూయ యాంకర్ గా వ్యవహరిస్తోంది. అనసూయ ఎల్లప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన ఫోటోలు వీడియోలు అభిమానులతో పంచుకుంటుంది. ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా స్కిన్ షో చేసేలాగా దుస్తులు ధరిస్తూ ఎప్పుడు వివాదాల్లో నిలుస్తూ ఉంటుంది.

ఇక సుమ కనకాల గురించి ఆమె యాంకరింగ్ గురించి చిన్న పిల్లలకు కూడా తెలుసు. ప్రీ రిలీజ్ లు, టీవీ షోస్ అంటూ తేడా లేకుండా అన్ని చోట్ల దర్శనమిస్తూ తన సత్తా చాటుతోంది. తెలుగు ఇండస్ట్రీలో సుమ కనకాల ఒక టాప్ యాంకర్ అని కూడా చెప్పవచ్చు. టాలీవుడ్ టాప్ హీరోలందరూ సుమ డేట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు అంటే ఆమె ఎంత బిజీగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. సుమ ఎంటర్ అయిందంటే ఏ షో అయినా సూపర్ హిట్ అవ్వాల్సిందే. తను మాట్లాడడం మొదలు పెడితే ఎదుటి వారికి మాట్లాడే అవకాశం లేకుండా చేస్తుంది.

సుమ ఈటీవీలో ప్రసారమయ్యే క్యాష్ ప్రోగ్రామ్ కి ఎన్నో సంవత్సరాల నుండి యాంకరింగ్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఇటీవల ఈ షో లో లూజర్ వెబ్ సిరీస్ టీం సందడి చేసింది. ఈ షోలో సుమ ఇచ్చే పనిష్మెంట్ లో భాగంగా ప్రియదర్శి సుమ బొమ్మ గీయాల్సి ఉంటుంది. ప్రియదర్శి ఏదో ఒక పిచ్చి బొమ్మ గీయగా దానికి సుమ స్పందిస్తూ ఏంటి ఇది నేనేనా? పుష్ప సినిమాలో దాక్షాయణిలా ఉందేంటి? అంటూ సుమ వ్యాఖ్యలు చేసింది. ఇలా సుమ దాక్షాయణి గెటప్ నీ, ఆ పాత్ర పోషించిన అనసూయను పరోక్షంగా కించపరిచింది. ప్రస్తుతం సుమ “జయమ్మ పంచాయితీ”అనే సినిమాలో కూడా నటిస్తోంది.