అక్కడ బన్నీని లేపడం ఆల్రెడీ స్టార్ట్ చేశారుగా.!

స్టైలిష్ అల్లు అర్జున్ పాన్ ఇండియన్ వైడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గా తన సినిమా “పుష్ప” తో మారబోతున్నాడని ఆ చిత్ర యూనిట్ నే కన్ఫర్మ్ చేసుకుంది. అయితే అల్లు అర్జున్ కి యూత్ లో సాలిడ్ ఫాలోయింగ్ ఉంది. ఎప్పుడు నుంచో తన సినిమాలు ఇతర రాష్ట్రాల్లో కూడా ఆదరణ పొందుతూ వస్తున్నాయి. కానీ కంప్లీట్ గా ఒక పరిపక్వత కలిగిన స్టార్ హీరో స్టేటస్ ఆ ఫాలోయింగ్ తెచ్చుకోవడానికి బన్నీకి మాత్రం ఇంత కాలం పట్టింది.

అయితే బన్నీ ని పాన్ ఇండియా లెవెల్లో నిలబెట్టాలి తన కాంపౌండ్ ఎంతలా ప్రయత్నిస్తుందో అనేది చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పొచ్చు. తన లేటెస్ట్ సినిమా పుష్ప ప్రమోషన్స్ కోసమే అల్లు అర్జున్ ఇప్పుడు పలు తెలుగు సినిమాల ఫంక్షన్స్ కి అటెండ్ అవుతున్నాడని తెలిసిందే.

పనిలో పనిగా నిన్న పలు హిందీ సినిమాల కోసం అల్లు అర్జున్ ప్రస్తావించడం వాటిని బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థలు రెస్పాండ్ అయ్యి బన్నీ కి థాంక్స్ చెప్పడం స్టార్ట్ చేశారు. అంటే ఇక బాలీవుడ్ లో బన్నీ ని లేపడం ఆల్రెడీ స్టార్ట్ అయ్యిందని చెప్పాలి. ఈ రకం ప్రమోషన్స్ కూడా అల్లు అర్జున్ ఒక్కడికే సాధ్యం అవుతాయి.