Hyper Aadi: హైపర్ ఆది పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అల్లు అర్జున్ ఫ్యాన్స్… ఎందుకంటే?

Hyper Aadi: జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో హైపర్ ఆది ఒకరు. ఈయన ప్రతి వారం ఏదో ఒక స్కిట్ ద్వారా ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తారు. అయితే కొన్నిసార్లు హైపర్ ఆది చేసిన స్కిట్ లు తీవ్ర వివాదాలకు కారణమవుతుంటాయి. ఇలా ఎన్నో సార్లు ఆది చేసిన స్కిట్ లు వివాదాన్ని ఎదుర్కోలేక బహిరంగంగా క్షమాపణలు చెప్పిన దాఖలాలు కూడా ఉన్నాయి. అయితే ఇలా ఎన్నిసార్లు ఆదికి చేదు అనుభవం ఎదురైన ఆది ఏమాత్రం తగ్గకుండా తనదైన శైలిలో స్కిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే హైపర్ ఆది మరోసారి నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యారు.

ఈవారం ప్రసారం కాబోయే జబర్దస్త్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా హైపర్ ఆది పుష్ప సినిమాలో అల్లు అర్జున్ స్కిట్ చేశారు. ఇలా అల్లు అర్జున్ పుష్ప సినిమా గురించి స్కిట్ చేయడంతో ఎంతో మంది ఫ్యాన్స్ ఈ స్కిట్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టిస్తోంది. అలాంటి సినిమాను ఇలా ఒక కామెడీ షోలో చేయడం ఏంటి అని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే హైపర్ ఆదిచేసే ఈ స్కిట్ ప్రస్తుతం వైరల్ కావడంతో అభిమానులు ఈ వారం ప్రసారం కాబోయే ఎపిసోడ్ లో స్కిట్ టెలికాస్ట్ కాకూడదని వార్నింగ్ ఇస్తున్నారు. ఒకవేళ టెలికాస్ట్ చేస్తే తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని అభిమానులు హైపర్ ఆదికి హెచ్చరికలు జారీ చేశారు. మరి ఈ విషయం పై హైపర్ ఆది ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.