అక్కడ ఆల్రెడీ లాభాలు ఇచ్చేసిన అక్కినేని బ్రదర్స్.!

ఈ ఏడాది అక్కినేని యంగ్ హీరోలు అక్కినేని నాగ చైతన్య అలాగే అక్కినేని అఖిల్ లకు లక్కీ ఇయర్ అని చెప్పాలి. చైతూ నటించిన “లవ్ స్టొరీ” తో ఆల్రెడీ భారీ హిట్ కొట్టగా ఇప్పుడు అఖిల్ తన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తో కూడా భారీ హిట్టు కొట్టాడు. అయితే ఈ చిత్రం ఓవర్సీస్ మార్కెట్ లో ఆల్రెడీ లాభల్లోకి వెళ్ళిపోయి ట్రేడ్ వర్గాలని ఆశ్చర్య పరిచింది. డీసెంట్ టార్గెట్ తో దిగిన ఈ చిత్రం నిన్నటి వీకెండ్ వసూళ్లుతో ప్రాఫిట్ జోన్ లోకి వెళ్ళిపోయిందట.

అలాగే దీనికి ముందు చైతూ లవ్ స్టోరీ కూడా పెద్ద టార్గెట్ పెట్టుకొని వెళ్లినా అది కూడా రీచ్ అయ్యి లాభాలు పండించింది. దీనితో యూఎస్ మార్కెట్ లో అక్కినేని బ్రదర్స్ ఇద్దరూ కూడా ఆదరగొట్టేసారని చెప్పాలి.