Shruthi Haasan: ప్రముఖ నటుడు కమల్ హాసన్ పెద్ద కుమార్తె శృతి హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. శృతిహాసన్ తెలుగు తమిళ్ హిందీ వంటి పలు భాషల్లో నటించి తన అందం అభినయంతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. శృతిహాసన్ నటి మాత్రమే కాకుండా ఒక మంచి సింగర్ కూడా. తాను నటించిన ఎన్నో సినిమాలలో శ్రుతి హాసన్ పాటలు పాడింది. శృతిహాసన్ తన సినీ జీవితంలో కొన్ని రోజులు బ్రేక్ వచ్చినప్పటికీ మళ్లీ సినిమాలలో బిజీ అయింది.
నిత్యం సినిమా షూటింగ్ తో బిజీగా ఉండే శృతిహాసన్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. కాస్త సమయం దొరికిందంటే చాలు అభిమానులతో సోషల్ మీడియాలో ఎప్పుడు చిట్ చాట్ చేస్తూ వారి ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ఉంటుంది. ఈ క్రమంలో కొందరు నెటిజన్లు విచిత్రమైన ప్రశ్నలు అడుగుతూ ఇబ్బంది పెడుతూ ఉంటారు. తాజాగా ఇంటర్వ్యూలో గూగుల్ లో అడిగిన ప్రశ్నలకు శృతిహాసన్ సమాధానం ఇచ్చారు
ఇంటర్వ్యూ లో భాగంగా కొందరు విచిత్రమైన ప్రశ్నలను అడగగా వారికి శృతిహాసన్ క్రేజీ గా బదులిచ్చారు.
ఇందులో భాగంగా ఒక నెటిజన్ తన ఫోన్ నెంబర్ అడగగా..100 అని అంతకు మునుపే ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చాను కదా అని బదులిచ్చింది. తన రిలేషన్షిప్ స్టేటస్ గురించి అడగగా..ఓహ్, మీ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో తెలుసు.. శ్రుతి హాసన్ ప్రియుడు శాంతను హజారిక ఎవరు? ఇదేగా మీ ప్రశ్న..అవును నేను డేటింగ్ చేస్తున్నాను.. ఎందుకంటే దీన్ని నేను ఆల్రెడీ గూగుల్ చేశాను. నీ ఆస్తి విలువ ఎంత అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. దాన్ని కనుక్కునే పనిలోనే ఉన్నాను. కానీ అది ఇంకా పెరుగుతూనే ఉంది అని సమాధానం ఇచ్చింది.