నలుగురు టీడీపీ నేతలకు షాక్.. అందరూ ఈమధ్య వైసీపీతో పెట్టుకున్నవారే 

ఒకేసారి నలుగురు టీడీపీ నేతలకు ప్రభుత్వ అధికారులు షాకిచ్చారు.  నలుగురికి సంబంధించిన వ్యాపారాల మీద ఎఫెక్ట్ పడేలా అధికారుల చర్యలున్నాయి.  ఇలా ఒక్కసారే నలుగురూ ఎఫెక్ట్ కావడంతో టీడీపీ శ్రేణుల్లో కలకలం మొదలైంది.  వీరిలో ముగ్గురు నేతల గ్రానైట్ క్వారీ పర్మిట్లను అధికారులు రద్దు చేయగా ఇంకో నేతకు చెందిన వాహనాలను సీజ్ చేశారు.  
 
ఎమ్మెల్యే రవికుమార్, మాజీ మంత్రి శిద్దా రాఘవరావు, మాజీ ఎమ్మెల్యే పోతుల 
 రామారావులకు గ్రానైట్ క్వారీలు ఉన్నాయి. అవే వారి ప్రధాన ఆర్థిక వనరులు.  వీరి క్వారీల్లో వెలికితీసిన గ్రానైట్ రాయిని విక్రయించడానికి ఇకపై పర్మిట్లు ఇవ్వమని అధికారులు ఈ ముగ్గురికీ తెలియజేశారట.  ఇన్నాళ్ళు ఎలాంటి ఇబ్బందీ లేకుండా పర్మిట్లు ఇచ్చినవారి ఇప్పుడు ఉన్నట్టుండి పర్మిట్లు ఇవ్వడం కుదరదని చెప్పడం వెనుక రాజకీయ కక్ష సాధింపులు ఉన్నాయని టీడీపీ శ్రేణులు అంటున్నాయి.  
 
కొన్నిరోజుల క్రితమే ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, శిద్దా రాఘవరావులతో అధికార పార్టీ నేతలు చర్చలు జరిపారట.  కానీ వారు పార్టీ మారేందుకు ఒప్పుకోక పోవడంతో ఈ తరహాలో వారిని ఇబ్బంది పెడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి.  ఇక మరొక నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి చెందిన నాలుగు టిప్పర్ వాహనాలను రవాణ శాఖ సీజ్ చేసింది.  బీస్ 3 వాహనాలను బీస్ 4 వాహనాలుగా మార్చి నడుపుతున్నారనే ఆరోపణలతో సీజ్ చేశారు.  గతంలో కూడా జేసీకి చెందిన 50కి పైగా వాహనాలను రవాణ శాఖ సీజ్ చేయడం జరిగింది.  జేసీ జగన్ యేడాది పాలనపై సంచలన చేసిన రెండు రోజులకే ఆయన వాహనాలు సీజ్ కావడంతో ఇది కూడా కక్ష సాధింపు చర్యేనని తెలుగు దేశం శ్రేణులు అభిప్రాయ పడుతున్నారు.