జోరు తగ్గని సూపర్ స్టార్!

సూపర్ స్టార్ రజనీకాంత్ క్రేజ్ ఎప్పటికప్పుడు కొత్తపుంతలు తొక్కుతూనే ఉంది. నేటికీ ఆయన సినిమాల జోరు ఏ మాత్రం తగ్గడం లేదు. తాజాగా ఈ సౌతిండియా సూపర్ స్టార్ తాజాగా మూడు చిత్రాల్లో నటిస్తున్నారంటే ఆశ్చర్యమే మరి! ఈ మూడు చిత్రాల్లో ఒకటి ‘జైలర్’. ప్రస్తుతం ఈ సినిమా మెరుపువేగంతో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రీకరణలో రజనీకాంత్‌ ఎంతో చురుకుగా పాల్గొంటూ యూనిట్ ని తెగ హుషారెక్కిస్తున్నారట!

మరో రెండు చిత్రాలు కూడా సన్నాహాల్లో ఉన్నాయి. రజనీకాంత్‌ నటించిన ‘2.ఓ’ సినిమా ఇప్పటికీ తమిళ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌గా తన స్థానాన్ని కాపాడుకుంటోంది. ఇటీవలి ‘పొన్నియన్‌ సెల్వన్‌ 1’, కమల్‌ హాసన్‌ ‘విక్రమ్‌’ ఘన విజయాలు సాధించిన విషయం తెలిసిందే. ట్రేడ్‌ వర్గాల తాజా గణాంకాల ప్రకారం ఈ రెండు సినిమాలు సాధించిన కలెక్షన్స్‌ రజనీ ‘2.ఓ’ వసూళ్లను దాటలేకపోయాయన్నది గమనార్హం! ‘2.ఓ’తో చూస్తే ‘పొన్నియన్‌ సెల్వన్‌ 1’ రూ.25 కోట్ల దాకా వెనకబడింది. ప్రేక్షకుల నుంచి దాదాపు 500 కోట్ల రూపాయలు రాబట్టిన ఈ చారిత్రక నేపథ్య చిత్రం రజనీ సినిమా తర్వాతి స్థానంలో నిలిచింది.

కమల్‌ హాసన్‌ ‘విక్రమ్‌’ మూడో స్థానానికి పరిమితమైంది. అదీ.. విషయం! ఇటీవల ఈ సూపర్‌స్టార్‌ రజనీకాంత చిత్రాలు పెద్దగా ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయాయి. ఆయన అభిమానులు కూడా ఆ సినిమాల ద్వారా ఏ మాత్రం సంతృప్తి పొందలేకపోయారు. అయినప్పటికీ.. ఈ వన్నెతగ్గని క్రేజీస్టార్ బాక్సాఫీస్ వద్ద క్రియేట్‌ చేసిన రికార్డులు మాత్రం ఇప్పటికీ చెక్కు చెదరడం లేదు. ఆయన స్టామినా అది. రజనీ అంటే మాటలా మరి!