స్వర్గసీమకు వెండితెర సత్యభామ!

తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో వన్‌ అండ్‌ ఒన్లీగా నిలిచిపోయిన సీనియర్‌ నటి జమున (89) కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని తన నివాసంలో శుక్రవారం తెల్లవారుజామున నిద్రలోనే తుదిశ్వాస విడిచారు. ఆమె 1965లో జూలూరి రమణరావును వివాహం చేసుకున్నారు. ఆయన 2014 నవంబరు 10లోనే గుండెపోటుతో మరణించారు. ఆమెకు కుమారుడు వంశీకృష్ణ, కూతురు స్రవంతి ఉన్నారు. ఉదయం నుంచే బంధువులు, సినీ ప్రముఖులు, అభిమానులు.. ఆమె ఇంటికి చేరుకుని నివాళులర్పించారు.

ఉదయం 11 గంటలకు జమున పార్థివ దేహాన్ని అభిమానుల సందర్శనార్థం ఫిల్మ్‌నగర్‌లోని ఫిల్మ్‌ ఛాంబర్‌కు తీసుకొస్తున్నట్లు కుటుంబసభ్యులు ప్రకటించారు. దీంతో జమునను కడసారి చూసేందుకు సినీనటులు, ఆర్టిస్టులు, అభిమానులు అక్కడికి తరలివచ్చారు. అయితే మధ్యాహ్నం వరకు రాకపోవడంతో చాలాసేపు నిరీక్షించారు. మధ్యాహ్నం 2.45 గంటల కు ఇంటి నుంచి బయలుదేరి 3:04 గంటలకు తీసుకొచ్చారు. సినీ రంగప్రముఖులు అక్కడికి చేరుకుని నివాళులర్పించారు. సీనియర్‌ నటుడు మురళీ మోహన్‌, నిర్మాత అల్లు అరవింద్‌, నటుడు నారాయణమూర్తి, మాదాల రవి, రోజా రమణి, మాజీ ఎంపీ సుబ్బిరామిరెడ్డి, దగ్గుబాటి సురేశ్‌బాబు, జీవిత రాజశేఖర్‌, కేవీ కృష్ణకుమారి, సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరి, కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు, రేలంగి నర్సింహరావు, కరాటే కల్యాణి, పసునూరి శ్రీనివాస్‌, సీనియర్‌ నటి శివపార్వతి, సీపీఐ నాయకులు రామకృష్ణ, పశ్య పద్మ, బాబ్జీ, రవి, తదితరులు పార్థీవ దేహం వద్ద నివాళులర్పించారు.

సాయంత్రం 4.05 గంటలకు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో అభిమానుల అశ్రునయనాల మధ్య జమున అంత్యక్రియలు ముగిశాయి. జమున కుమార్తె స్రవంతి ఆమెకు అంతిమ సంస్కారాలు నిర్వహించి చితికి నిప్పంటించారు. జమున కుమారుడు వంశీకృష్ణ విదేశాల్లో ఉండటంతో రావడానికి ఆలస్యం అవుతుందని కూతురే దహన సంస్కారాలు నిర్వహించారు.

1936 ఆగస్టు 30న హంపీలో జన్మించిన జమున తల్లిదండ్రులు నిప్పణి శ్రీనివాసరావు, కౌసల్యాదేవి. ఆమె మాతృభాష తెలుగు కాకపోయినా తెలుగునేలలో పెరిగి, తెలుగు చలన చిత్రసీమలో అరుదైన కథానాయికగా గుర్తింపు పొందారు. . తెలుగు సినిమాలతో పాటు తమిళం, కన్నడ, హిందీ చిత్రాల్లోనూ ఆమె నటించి అక్కడా పేరు తెచ్చుకున్నారు. ఐదు దశాబ్దాలకు పైగా సినీ రంగంలో, వివిధ పాత్రల్లో ప్రేక్షకుల హృదయాలలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నజమున తన అభిమానులను, సినీ వర్గాలను కన్నీటముంచి తుది శ్వాస విడిచారు. వెండితెర సత్యభామగా ప్రేక్షకుల మనసులలో నిలిచిపోయిన జమున నటనలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు.

పౌరాణికమైనా, జానపదమైనా, సాంఘికమైనా తనకు ఇచ్చిన పాత్రలో అవలీలగా నటించే వారు. 1937 కర్ణాటక రాష్ట్రంలోని హంపిలో జన్మించిన జమున, కుటుంబ సభ్యులు గుంటూరు జిల్లాకు వలస వెళ్లడంతో గుంటూరు జిల్లా దుగ్గిరాలలో ఆమె బాల్యం గడిచింది. జమున అసలు పేరు జానాబాయి. అయితే నక్షత్రాన్ని బట్టి ఏదైనా నది పేరు ఉండాలని జ్యోతి ఆమె పేరు మధ్యలో మూ అనే అక్షరాన్ని చేర్చి జమున అని పేరు పెట్టారు. ఉత్తరాదివారు యమునను జమునగా పిలవడంతో ఆమెకు ఆ పేరు ఉంచారు. సినిమా కోసం ప్రత్యేకంగా ఆమె పేరు మార్చలేదు. చదువుకునే రోజుల్లోనే నాటకాలపై ఆకర్షితురాలైన జమున తమ కుటుంబానికి ఎంతో సన్నిహితంగా ఉన్న నటుడు జగ్గయ్య ప్రేరణతో నాటక రంగంలోకి అడుగుపెట్టారు. సహజంగా బెరుకు అంటూ లేని జమున అలా స్కూలులో చదివేకాలంలో నాటకాలపై ఆకర్షితురాలయ్యింది.

తెనాలి సమీపంలోని మండూరు గ్రామంలో ‘ఖిల్జీ రాజ్య పతనం’ అనే నాటిక ప్రదర్శన కోసం ప్రత్యేకంగా జగ్గయ్య జమున ఎంపిక చేసుకుని తీసుకువెళ్ళాడు. ఇదే నాటికలో మరో ప్రముఖ నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు కూడా నటించాడు. నాటకాలలో ఆమె ప్రతిభ నలుమూలలకూ పాకడం వల్ల సినిమా అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. బి.వి.రామానందం తీసిన పుట్టిల్లు (1953) ఆమె తొలిచిత్రం. ఆ తరువాత నిరుపేదలు (1954), బంగారు పాప (1954), వదినగారి గాజులు (1955), దొంగరాముడు (1955), సంతోషం (1955), చింతామణి (1956), చిరంజీవులు (1956), తెనాలి రామకృష్ణ (1956), భాగ్యరేఖ (1957), దొంగల్లో దొర (1957), వినాయక చవితి (1957), సతీ అనసూయ (1957), భూకైలాస్ (1958), పెళ్ళినాటి ప్రమాణాలు (1958), శ్రీకృష్ణ మాయ (1958), అప్పుచేసి పప్పుకూడు (1959), ఇల్లరికం (1959), వచ్చిన కోడలు నచ్చింది (1959), సిపాయి కూతురు (1959), కృష్ణ ప్రేమ (1961), మోహినీ రుక్మాంగద (1962), ఖడ్గవీరుడు (1962), ఈడూ జోడూ (1964), వీరసేనాపతి (1964), రాముడు భీముడు (1964), దొరికితే దొంగలు (1965), పల్నాటి యుద్ధం (1966), శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు కథ (1966), ఉండమ్మా బొట్టు పెడతా (1968), పెళ్ళిరోజు (1968), అత్తా ఓ కోడలే (1969), ఏకవీర (సినిమా) (1969), మట్టిలో మాణిక్యం (1971), పండంటి కాపురం (1972), మేన కోడలు (1972), నిండు కుటుంబం (1973), స్నేహ బంధం (1973), దీక్ష (1974), భూమి కోసం (1974), సంసారం (1975), మేమూ మనుషులమే (1975) – కుప్పి, మొగుడా- పెళ్ళామా (1975), మంచి రోజు (1977), కురుక్షేత్రం (1977), కటకటాల రుద్రయ్య (1978), చిరంజీవి రాంబాబు (1978), సతీ సావిత్రి (1978), రాజపుత్ర రహస్యము (1978), శ్రీరామ పట్టాభిషేకం (1978), బంగారు కొడుకు (1982), జల్సారాయుడు (1983), రాజకీయ చదరంగం (1989), అన్నపూర్ణమ్మ గారి మనవడు (2021) తదితర చిత్రాల్లో నటించారు జమున.

అక్కినేని నాగేశ్వరరావు, జగ్గయ్య, నందమూరి తారక రామారావు తదితర నటుల సరసన నాయికగా నటించింది. ఎన్ని పాత్రలలో నటించినా ఆమెకు బాగా పేరు తెచ్చింది సత్యభామ పాత్రే. ఆ పాత్రలో ఇప్పటికీ ఆమెను తప్ప మరొకరిని ఊహించుకోలేము అన్నట్టుగా నటించారమే. ‘వినాయకచవితి’ చిత్రంలో మొదటి సారి సత్యభామలో జమున కనిపిస్తుంది. ఆ తర్వాత ‘శ్రీకృష్ణ తులాభారం’ చిత్రంలో కూడా అదే పాత్ర వేసింది. ఈ సినిమాలో సత్యభామ ఆహార్యం గురించి ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలోని పాత్రే ఆమెకు పేరు తెచ్చింది. కళపై ఉన్న మక్కువతో నాటకాల్లో బుర్రకథ బ్రహ్మ నాజర్‌ దగ్గర శిక్షణ తీసుకోవటం తన నట జీవితానికి పట్టం కట్టిందన్నారు. తెలుగుసినిమాల్లో వగరు, పొగరు, భక్తి, ఇలా నవరసారాలు పలకించగలిగే అరుదైన నటిగా జమున పేరు సంపాదించుకున్నారు. తెలుగు తెర సత్యభామగా తనదైన నటనతో ఆకట్టుకున్నారు. ఈమె మరణంతో ‘గుండమ్మ కథ’ సమాప్తం అని చెప్పాలి.

ఎన్ఠీఆర్, ఏఎన్నార్ వంటి ఇద్దరు స్టార్ హీరోలు.. సావిత్రి జమున వంటి హేమాహేమీలున్న సినిమాకు సూర్యకాంతం వంటి నటి టైటిల్‌ రోల్లో ‘గుండమ్మ కథ’ పేరు పెట్టడం అప్పట్లో పెద్ద సంచలనం. ఇక గుండమ్మ పేరు మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా కనపడదు. కన్నడ పేరు. అయినా.. తెలుగు ప్రేక్షకులు గుండమ్మ పేరుతో బాగానే కనెక్ట్ అయ్యారు. తాజాగా జమున మరణంతో గుండమ్మ కథ సమాప్తమైంది. ఈ సినిమాలో నటించిన టైటిల్ పాత్రధారిని సూర్యకాంతంతో పాటు ఎన్టీఆర్, ఏఎన్నార్,సావిత్రి, రమణారావు, రాజనాల, అల్లు రామలింగయ్య, ఛాయా దేవి,హరనాథ్ వంటి నటీనటులతో పాటు ఈ సినిమా దర్శకుడు కమాలకర కామేశ్వరరావు, నిర్మాతలైన బి.నాగిరెడ్డి, చక్రపాణి ఎపుడో కాలం చేసారు. తాజాగా జమున మరణంతో ఈ సినిమాలో ముఖ్యపాత్రలు మరణంతో ‘గుండమ్మ కథ’ ముగిసిందనే చెప్పాలి. ఈ సినిమాలో నటించిన ‘ఎల్. విజయలక్ష్మీ మాత్రమే జీవించి ఉంది.

జమున.. గడుసుతనానికి ఆమె పెట్టింది పేరు. సౌందర్యానికి అసలు సిసలు చిరునామా. సినిమా ఏదైనా పాత్రే కనబడుతుంది.. కానీ, నటి కనబడదు. ముఖ్యంగా వెండితెరపై సత్యభామ పేరు వినపడగానే ఆమె రూపమే గుర్తొస్తుంది. వెండితెరపై విభిన్న పాత్రలను అవలీలగా పోషించి… తెలుగు ప్రేక్షక హృదయాల్లో విశిష్ట స్థానం పొందిన నటి జమున. జమున వెండితెర మీద పరుచుకున్న నిండు పున్నమి వెన్నెల. ఆమె హావభావ విన్యాస ప్రదర్శన ముందు ఎన్నో పాత్రలు సవినయంగా తల వంచాయి. జమునకు మంచి బ్రేక్ ఇచ్చిన మూవీ ‘అంతా మనవాళ్లే’. తాపీ చాణక్య డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాతో జమున వెనుదిరిగి చూసుకోలేదు. జమున అసమాన నటనా ప్రతిభే …ఆమెకు అగ్రహీరోలైన ఎన్టీఆర్, ఏఎన్నాఆర్ సరసన అవకాశాలు కల్పించాయి. సత్యభామ దర్పానికి, రాణీ మాలీని దేవి అహంకార ప్రదర్శనకు, అన్నపూర్ణ సహనానికీ, అరుంధతి ఓర్పుకు, కలెక్టర్ జానకి హుందాతనానికీ, గౌరమ్మ చిలిపితనానికీ, చిరునామా.

ఆర్ద్రతకు, అనురాగానికి, అనుబంధానికి ప్రేమకు ప్రతీకగా నిలిచే జమున అభినయం నేటి తరం కథానాయికలకు పాఠాలు. అందుకే పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేయడం నటిగా జమున ప్రత్యేకత. వెండితెరపై జమున అందం.. ఒక వెన్నెల వర్షం. ఎన్నటికీ వాడిపోని పారిజాత పుష్పం.. మిస్సమ్మలో జమున పాత్ర చలాకీగా ఉంటూ సావిత్రిని ఉడికిస్తూ సాగుతుంది. అసలు జమున అందమంతా ఆమె నడక, మాటతీరు, కళ్లలోనే ఉంటుంది. బృందావనమిది అందరిది.. పాట జమున నట జీవితంలో నేటికి నిలిచే ఉంది అందుకే. జమున క్రమశిక్షణ, నియమబద్ధ జీవనవిధానం.. ఆదర్శప్రాయం. సూర్య చంద్రులకు గ్రహణాలు తప్పవన్నట్లు కెరీర్ సాఫీగా సాగుతున్న దశలోనే ఎన్టీఆర్, ఎఎన్ఆర్లతో విభేధాలు.. జమునకు వారి సరసన అవకాశాలు దూరం చేశాయి.

ఆ తర్వాత ప్రముఖ నిర్మాత చక్రపాణి జోక్యంతో ఈ విభేదాలకు తెరపడింది. ముఖ్యంగా ‘గుండమ్మకథ’ లో గడసరి పాత్రలో జమున నటన నేటికి మరిచిపోలేము. గుండమ్మ కథ విజయానికి జమున పాత్ర కూడా దోహదం చేసిందనడంలో అతిశయోక్తి కాదు. ఈ సినిమా నుంచి జమునకు మళ్లీ మహర్దశ ప్రారంభమైంది. కళ్లను పక్కకు తిప్పుకోలేని అందం జమున సొంతం. ఆ రోజుల్లో హీరోలు, నిర్మాతలు, దర్శకులు.. ఆమె కాల్షీట్లు దొరికిన తర్వాతే షూటింగ్ మొదలు పెట్టేవారు. కళ్లతోనే విలనిజాన్ని కురిపించగలదు. పండంటి కాపురంలో నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ను అద్బుతంగా పోషించి మెప్పించింది. ఇక పౌరాణిక చిత్రాల్లో.. కృష్ణుడి పాత్రంటే, ప్రేక్షకులకు ఎన్టీఆరే ఎలా గుర్తుకువస్తాడో.. సత్యభామ పాత్రలో జమున అలా గుర్తుకువస్తుంది. అంతకు ముందు సత్యభామ పాత్రలో ఎస్.వరలక్ష్మీ, సావిత్రి వంటి నటీమణులు నటించినా.. సత్యభామగా.. జమునకు వచ్చినంత నేమ్ అండ్ ఫేమ్ ఎవరికీ రాలేదు. తెలుగుతెరపై సత్యభామ అంటే జమునే అన్న చందంగా..తనదైన నట విన్యాసంతో, జాణతనంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. సినీ రంగంలో ఉంటూనే సేవ, రాజకీయ రంగాల్లోనూ జమున విశేషంగా కృషి చేసింది. ఏటా తన పుట్టినరోజున పేద కళాకారులకు ఆర్థిక సాయం చేసేది.

1980లో ఇందిరా గాంధీ ప్రేరణతో కాంగ్రెస్ పార్టీలో చేరింది. 1989లో రాజమండ్రి నుంచి ఎంపీగా గెలిచారు. సినీ రంగంలో ఉంటూనే సేవ, రాజకీయ రంగాల్లోనూ జమున విశేషంగా కృషి చేశారు. ఆ తర్వాత 1991 మధ్యంతర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసి ఓడిపోయింది. ఆ తర్వాత బీజేపీలో చేరారు. ఆపై రాజకీయాలకు గుడ్ డై చెప్పేసారు. నేటికి రంగస్థల కళాకారుల కోసం సేవలందిస్తూనే ఉంది జమున. పాతతరంలో హీరోయిన్లలో సావిత్రి తర్వాత స్థానం జమునదే. తెలుగులో 145 చిత్రాల్లో నటించిన ఈమె తమిళంలో 20, కన్నడలో 7, హిందీలో ‘మిలన్’, మిస్ మేరి వంటి 10కి పైగా బాలీవుడ్ చిత్రాల్లో నటించి మెప్పించారు. అప్పటి అగ్ర హీరోలైన ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు,హరనాథ్, జగ్గయ్య వంటి నటులతో స్క్రీన్ షేర్ చేసుకుంది. చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చిన తొలి తరం నటి ఈమెనే కావడం విశేషం. అప్పట్లో చైన్నైలో తన ఆస్తులను ఎంతో తక్కువగా అమ్మేయడం పెద్ద చర్చనీయాంశం అయింది. జమున కెరీర్‌లో టాప్ చిత్రాల విషయానికొస్తే.. ‘గుండమ్మ కథ, మిస్సమ్మ, ఇల్లరికం, శ్రీ కృష్ణతులాభారం, మూగనోము, లేత మనసులు, మూగ మనసులు, నిరు పేదలు, మా గోపి, తెనాలి రామకృష్ణ,మంగమ్మ శపథం, ఇలవేల్పు, సంసారం, రాము, దొంగరాముడు, అప్పచేసి పప్పుకూడు, భూ కైలాస్, గులేబకావళి కథ, ఉండమ్మ బొట్టు పెడతా, మనుషులంతా ఒక్కటే, సంపూర్ణ రామాయణం, పండంటి కాపురం, చిత్రాలు మంచి పేరు తీసుకొచ్చాయి. జమున కెరీర్‌లో టాప్ చిత్రాల విషయానికొస్తే.. ‘గుండమ్మ కథ, మిస్సమ్మ, ఇల్లరికం, శ్రీ కృష్ణతులాభారం, మూగనోము, లేత మనసులు, మూగ మనసులు, నిరు పేదలు, మా గోపి, తెనాలి రామకృష్ణ,మంగమ్మ శపథం, ఇలవేల్పు, సంసారం, రాము, దొంగరాముడు, అప్పచేసి పప్పుకూడు, భూ కైలాస్, గులేబకావళి కథ, ఉండమ్మ బొట్టు పెడతా, మనుషులంతా ఒక్కటే, సంపూర్ణ రామాయణం, పండంటి కాపురం, చిత్రాలు మంచి పేరు తీసుకొచ్చాయి. ఇక ఎన్టీఆర్‌తో చేసిన ‘మంగమ్మ శపథం, రాము,రాముడు భీముడు,శ్రీ కృష్ణ తులభారం, బొబ్బిలి యుద్దం, చంద్రహారం, చిత్రాలు మంచి పేరు తీసుకొచ్చాయి.

అక్కినేనితో చేసిన మూగ మనసులు, మూగనోము, ఇల్లరికం, మిస్సమ్మ, గుండమ్మ కథ,పూల రంగడు వంటి చిత్రాలు వీరి జోడికి మంచి పేరు తీసుకొచ్చాయి. పెళ్లి తర్వాత అందరి సినీ జీవితం కంచికి చేరుతుంది. కానీ జమున మాత్రం పెళ్లైన తర్వాత కూడా కెరీర్‌ను కంటిన్యూ చేసింది. 1968: ఉత్తమ సహాయ నటిగా ఫిలింఫేర్ అవార్డు – మిలన్, 1964: ఉత్తమ సహాయ నటిగా ఫిలింఫేర్ అవార్డు – మూగ మనసులు, 2008: ఎన్.టి.ఆర్ జాతీయ పురస్కారం, 2021 సెప్టెంబర్ 17న హైదరాబాద్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్‌ హాలులో జరిగిన సాక్షి మీడియా 2019, 2020 ఎక్స్‌లెన్స్‌ అవార్డుల కార్యక్రమంలో జీవితసాఫల్య పురస్కారం అందుకున్నారు.

సినీతారలుగా ఉండి, రాజకీయాలలో ప్రవేశించి రాణించిన కథానాయికలలో జమున అగ్రస్థానంలో ఉంటారు. దివంగత ప్రధాని ఇందిరా గాంధీ అంటే ఉన్న అభిమానం, గౌరవం నన్ను రాజకీయాలలోకి లాక్కొచ్చాయి అని తన రాజకీయ జీవితం గురించి చెప్పుకున్నారు జమున. ఆమె నటించిన మిస్సమ్మ, ఇల్లరికం, ఇలవేల్పు, లేతమనసులు, గుండమ్మ కథ చిత్రాలు విజయవంతమయి రజతోత్సవం కూడా జరుపుకున్నాయి. జమున చిన్నతనం నుండే నాటకాలలో నటించేవారు. జమున తల్లి ఆమెకు శాస్త్రీయ సంగీతం, హార్మోనీయంలలో శిక్షణ ఇప్పించారు.

మా భూమి నాటకంలో జమున ఒక పాత్ర పోషించగా, ఆమె అభినయం నచ్చి ఆమెకు పుట్టిల్లు (1953)లో నటిగా అవకాశం ఇచ్చారు. ఆ సినిమాతో సినిమాలలోకి తెరంగేట్రం చేశారామె. తెలుగు, దక్షిణభారత భాషల్లో కలిపి ఆమె 198 సినిమాలు చేశారు. పలు హిందీ సినిమాలలో కూడా నటించారు. 1967లో ఆమె హిందీలో చేసిన మిలన్ సినిమా, 1964లో విడుదలైన మూగ మనసులు సినిమాలకు గాను ఉత్తమ సహాయ నటిగా ఫిలింఫేర్ అవార్డు లభించింది. తెలుగు ఆర్టిస్ట్ అసోసియేషన్ అనే సంస్థ నెలకొల్పి 25సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారామె. 1980లలో కాంగ్రెస్ పార్టీలో చేరి రాజమండ్రి నియోజకవర్గం నుంచి 1989లో లోక్ సభకు ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తరువాత రాజకీయాల నుండి తప్పుకున్నా, 1990వ దశకంలో భారతీయ జనతా పార్టీ తరఫున ప్రచారం చేశారు.

మహానటి జమున పేరు వినగానే.. ఆ నాటి ఆమె అందం, అభిన‌యం గుర్తుకు వ‌స్తుంది. కలువ‌ల్లాంటి క‌ళ్ల‌తో కోటి భావాలు ప్ర‌క‌టిస్తార‌మె. క‌నుబొమ్మ‌లతోనే త‌న మ‌న‌సులోని భావాల‌ను వ్య‌క్త‌ప‌రుస్తారు. ఆ మ‌హాన‌టి న‌ట‌న‌ను ఇప్ప‌టికీ అభిమానులు గుర్తు చేసుకుంటూ ఆనందిస్తుంటారు. 1966లో జ‌మున‌, హ‌రనాథ్ జంట‌గా న‌టించిన లేత మ‌న‌సులు చిత్రంలోని అందాల ఓ చిలుకా సాంగ్‌ను ఆమె అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. క‌ళ్ల‌తో భావాలు ప‌లికించిన తీరును చూసి.. ఆమె అభిన‌యానికి ఫిదా అవుతున్నారు. ఆ పాట‌లో జ‌మున న‌టించిన తీరు ప్ర‌తి ప్రేమికుడిని మెప్పిస్తుంది. అంతే కాదు.. ఆ పాట విన్నాక జీవితంలో ఒక్క‌సారైనా ప్రేమ లేఖ రాయ‌ల‌న్న భావ‌న క‌లుగుతుంది. అంత‌గా న‌టించారు జ‌మున‌. అందాల చెలికాడా అందుకో నా లేఖ.. నా క‌నుల‌తో రాసాను ఈ మ‌దిలోన దాచాను అన్న లిరిక్స్ మ‌హాద్భుతం. ఈ లిరిక్స్ ప్ర‌తి ప్రేమికుడి గుండెల‌ను హ‌త్తుకున్నాయ‌నడంలో సందేహం లేదు.