ఏషియన్ వైష్ణవి మల్టీప్లెక్స్ ని ఘనంగా ప్రారంభించిన హను-మాన్ టీమ్

”ఏషియన్ సినిమాస్ చాలా అద్భుతమైన క్యాలిటీతో ప్రేక్షకులకు గొప్ప థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వడానికి ఆధునాతన టెక్నాలజీతో స్క్రీన్స్ ని తీసుకురావడం చాలా అనందంగా వుంది. మా ‘హను-మాన్’ చిత్రంతో ఏషియన్ వైష్ణవి మల్టీప్లెక్స్ ప్రారంభం కావడం సంతోషంగా వుంది” అన్నారు దర్శకుడు ప్రశాంత్ వర్మ.

ఆర్సీ పురంలోని ‘ఏషియన్ వైష్ణవి మల్టీప్లెక్స్ ని ‘హను-మాన్’ టీమ్ ఘనంగా ప్రారంభించింది. హనుమాన్ చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ, హీరో తేజ సజ్జా, నిర్మాత కె నిరంజన్ రెడ్డి తో పాటు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత నవీన్ యెర్నేని జ్యోతి ప్రజ్వలన చేశారు.

అనంతరం దర్శకుడు ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. మా ‘హను-మాన్’ చిత్రంతో ఏషియన్ వైష్ణవి మల్టీప్లెక్స్ ప్రారంభం కావడం సంతోషంగా వుంది. ఏషియన్ సినిమాస్ చాలా అద్భుతమైన క్యాలిటీతో ప్రేక్షకులకు గొప్ప థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వడానికి ఆధునాతన టెక్నాలజీతో స్క్రీన్స్ ని తీసుకురావడం చాలా అనందంగా వుంది. ఏసియన్ సునీల్ గారు లాంటి వారు వుండటం అనేది ఫిల్మ్ మేకర్ గా అదృష్టంగా భావిస్తున్నాం. సినిమాని ఇంత అద్భుతంగా ప్రోత్సహిస్తున్న సునీల్ గారికి ధన్యవాదాలు. బిజినెస్ లానే కాకుండా చాలా ప్యాషన్ తో ప్రేక్షకులకు అద్భుతమైన ఎక్స్ పీరియన్స్ ఇస్తున్నారు. సినిమాకి వెళ్ళడం అనేది ఒక కుటుంబానికి మంచి జ్ఞాపకం. సినిమాతో పాటు ఇంత చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం క్రియేట్ చేసి చాలా మంచి అభిరుచితో థియేటర్స్ ని రూపొందిస్తున్న సునీల్ గారికి, భరత్ గారికి ధన్యవాదాలు. ఏషియన్స్ సినిమాస్ మొదలుపెట్టిన ఏయంబీ, ఏఏఏ.. లానే వైష్ణవి సినిమాస్ కూడా చాలా సక్సెస్ ఫుల్ గా రన్ అవ్వాలని కోరుకుంటున్నాను” అన్నారు.

హీరో తేజా సజ్జా మాట్లాడుతూ.. హను మాన్ చిత్రానికి ప్రేక్షకులు చూపిస్తున్న అసాధారణమైన ప్రేమకు కృతజ్ఞతలు. హనుమాన్ సినిమాతో ఈ ఏషియన్ వైష్ణవి మల్టీప్లెక్స్ ప్రారంభం కావడం అనందంగా వుంది. ఇది మాకు, థియేటర్స్ వాళ్ళకి అందరికీ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. సునీల్ గారు ప్రతి థియేటర్ ని చాలా లగ్జరీగా తీర్చిదిద్దుతారు. ఈ థియేటర్ కూడా అద్భుతంగా వుంది” అన్నారు.

ఈ కార్యక్రమంలో సునీల్ నారంగ్, భరత్ నారంగ్, జ్యేష్ట నారంగ్, మైత్రీ మూవీ మేకర్స్ యలమంచిలి రవిశంకర్, శశి, సదానంద్ తదితరులు పాల్గొన్నారు.