Mirai OTT: టాలీవుడ్ యంగ్ హీరో తేజా సజ్జా గురించి మనందరికీ తెలిసిందే. హనుమాన్ మూవీతో హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు. ఈ సినిమా తర్వాత వచ్చిన జాంబిరెడ్డి సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది. కాగా తేజా సజ్జా నటించినది తక్కువ సినిమాలే అయినప్పటికీ నటించిన సినిమాలు అన్నీ కూడా సూపర్ హిట్ గా నిలిచాయి. ఇకపోతే హీరో తేజా సజ్జా ఇటీవల మిరాయ్ మూవీ తో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.
కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ ఫాంటసీ అడ్వెంచర్ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ గా నిలిచింది. కాగా ఈ సినిమాలో మంచు మనోజ్ కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. సినిమాలో తేజా సజ్జా, మంచు మనోజ్ యాక్టింగ్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ సినిమాలోని ప్రతీ సీన్ హైలెట్ అయ్యిందని చెప్పాలి. ఇందులో రితిక నాయక్ హీరోయిన్ గా నటించింది. అయితే ఇన్నాళ్లు థియేటర్లలో మెప్పించి మంచి రెస్పాన్స్ అందుకున్న ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయ్యింది.
ఈ విషయాన్ని తాజాగా మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జియో హాట్ స్టార్ వేదికగా అక్టోబర్ 10 నుంచి స్ట్రీమింగ్ కానుందట. కాగా ఈ విషయాన్ని తెలుపుతూ సంస్థ ఒక పోస్టర్ ని పంచుకుంది. తెలుగుతో పాటు కన్నడ, మలయాళం, హిందీ, తమిళం భాషలలో ఈ సినిమా అందుబాటులోకి రానుంది. దీంతో ఇన్నాళ్లు థియేటర్లలో ఈ చిత్రాన్ని మిస్సైన అడియన్స్ ఇప్పుడు ఈ సినిమాను ఓటీటీలో చూడవచ్చు. మరి థియేటర్లలో మెప్పించిన ఈ సినిమా ఓటిటిలో ఏ మేరకు సక్సెస్ను అందుకుంటుందో చూడాలి మరి.
Mirai OTT: ఓటీటీలోకి రాబోతున్న మిరాయ్.. స్ట్రీమింగ్ ఎప్పుడు ఎక్కడో తెలుసా?
