సూపర్‌హీరో తేజా సజ్జా బాక్సాఫీస్ వద్ద విజయయాత్ర కొనసాగిస్తున్నారు. ఆయన తాజా చిత్రం మిరాయ్ ప్రపంచవ్యాప్తంగా 150 కోట్లు వసూలు చేస్తూ సూపర్‌హిట్ ట్రాక్‌పై దూసుకెళ్తోంది. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా సీజన్‌లోనే పెద్ద హిట్‌గా నిలిచింది.
గట్టి పోటీ మధ్య కూడా మిరాయి అద్భుతంగా కంటిన్యూ అవుతోంది. ఇటీవలే ఉత్తర అమెరికాలో 3 మిలియన్ డాలర్ల మార్క్ దాటిన ఈ చిత్రం, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మరో కీలక మైలురాయిని అందుకుంది.
హనుమాన్ తర్వాత వరుసగా రెండోసారి 150 కోట్లకు పైగా వసూళ్లు సాధించడం తేజా సజ్జా కెరీర్‌కు మైల్ స్టోన్ గా నిలిచింది. రెండు బ్లాక్‌బస్టర్స్‌తో వరుస విజయాలు అందుకున్న ఆయన బాక్సాఫీస్ వద్ద డిపెండబుల్ హీరోగా ఎదుగుతున్నారు.
తేజ సజ్జ ‘మిరాయ్’ సినిమా రివ్యూ: టాలీవుడ్ నుంచి మరో కొత్త ప్రయత్నం
రితికా నాయక్ హీరోయిన్‌గా, మనోజ్ మంచు, శ్రీయా శరణ్ ముఖ్యపాత్రల్లో నటించిన ఈ చిత్రం, యాక్షన్ సన్నివేశాలు, విజువల్ ప్రెజెంటేషన్‌తో పాటు కుటుంబ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. కంటెంట్ బలంతో పాటు పండుగ సీజన్ కలిసివచ్చి, ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది.
టీమ్ మిరాయ్ టికెట్ ధరలు పెంచకుండా ఈ విజయాన్ని సాధించింది. భారీ హైప్, మంచి రివ్యూలు ఉన్నప్పటికీ సినిమాను అందరికీ అందుబాటులో ఉంచాలనే వారి సంకల్పాన్ని ఇది చూపిస్తోంది.
దసరా సెలవులు థియేటర్లలో ప్రేక్షకులను మరింతగా రప్పిస్తుండటంతో మిరాయ్ డ్రీమ్ రన్ విజయవంతంగా కొనసాగనుంది.


