ప్రస్తుత కాలంలో మహిళలకు బయటికి వెళితే రక్షణ లేకుండా పోతోంది. ఆడపిల్ల ఒంటరిగా కనిపిస్తే చాలు వాయిస్‌తో సంబంధం లేకుండా చిన్నపిల్లల నుండి ముసలి వారి వరకు అందరిపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. దీంతో మహిళలు ఒంటరిగా బయటకు వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితిలో ఏర్పడుతున్నాయి. మహిళలపై ఇలాంటి ఆగడాలను అరికట్టటానికి పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నప్పటికీ ఇలాంటి కామాందుల వికృతి చేష్టలు మాత్రం ఆగటం లేదు. ఇటీవల కార్యాలయంలో ఒక మహిళా ఉద్యోగిని పట్ల అధికారి నీచంగా ప్రవర్తించిన తీరు సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డు కావడంతో వెలుగులోకి వచ్చింది.
వివరాలలోకి వెళితే.. కౌశాంబి జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. కౌశాంబి జిల్లాలో ప్రొబేషన్ ఆఫీస్‌లో ప్రొబేషన్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న రామ్ నాథ్(65) అనే వ్యక్తి అదే కార్యాలయంలో పనిచేస్తున్న ఒక మహిళ ఉద్యోగి మీద కన్ను వేశాడు. ఎలాగైనా ఆమెను లోపర్చుకోవాలని ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో పని వంకతో ఆ మహిళా ఉద్యోగిని తన కేబుల్ లోకి పిలిపించుకొని ఆమెతో మాట్లాడుతున్నట్లుగా నటిస్తూ ఆమె ప్రైవేట్ పార్ట్స్ పై చేతులు వేస్తూ ఆమెను లైంగికంగా వేధించేవాడు. అధికారి తీరుతో భయానికి గురైన సదరు మహిళా ఉద్యోగి భయంతో అక్కడి నుండి వెళ్ళిపోయింది.
అయితే తరచూ ఇలా అతను లైంగిక వేధింపులకు పాల్పడటంతో ఆ మహిళా ఉద్యోగి రామ్ నాథ్ మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా కార్యాలయంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలించగా సదరు అధికారి మహిళా ఉద్యోగి పట్ల నీచంగా ప్రవర్తించినట్లు రికార్డ్ అయి ఉండటంతో అతని బండారం బయటపడింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఘటనపై స్పందించిన సమాజ్ వాది పార్టీ మీడియా సెల్ సీఎంను ప్రశ్నించింది. ఇక లైంగిక వేధింపుల కేసులో సదరు అధికారిని పోలీసులు అరెస్టు చేసి విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది.
ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లా ప్రొబేషన్ కార్యాలయంలో ఇటీవల దారుణ ఘటన జరిగింది. ఆఫీసులో పని చేసే మహిళా ఉద్యోగిని జిల్లా ప్రొబేషన్ అధికారి రామ్‌నాథ్ రామ్ వేధించాడు. ఆమె శరీరంపై చేతులు వేసి ఇబ్బంది పెట్టాడు. ఈ వీడియోను సమాజ్‌వాదీ పార్టీ మీడియా సెల్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. pic.twitter.com/NDlkBXhqwC
— Hardin (@hardintessa143) December 28, 2022