సినిమా ఇప్పుడే మొదలయ్యింది : రామ్ గోపాల్ వర్మ

– శేఖర్ రాజు కేసుకి సంబంధించిన పూర్తి వివరాలు

”2019 ఆఖర్లో శేఖర్ రాజు అనబడే వ్యక్తి దిశా ఎన్కౌంటర్ అనే సినిమా తొలి కాపీ 3 కోట్ల ఫస్ట్ కాపీ వ్యయంతో నాతో నిర్మించడానికి ఒప్పుకోవడం జరిగింది.

శేఖర్ రాజు 56 లక్షల వరకు ఇఛ్చి షూట్ మొదలు పెట్టిన తర్వాత తన వద్ద ఇంకా డబ్బులు లేవని , ఎక్కడినుంచో రావాల్సిన డబ్బులు రాలేదని చెప్పడం జరిగింది. అలా అయితే ఇంక సినిమా షూటింగ్ ఆపేస్తున్నానని , ఇంకో నిర్మాత ఎప్పుడైనా వస్తే రిలీజ్ అయ్యే టైంకి తన డబ్బు తిరిగిస్తానని ఒప్పుకున్నాను” అని తెలిపారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా విడుదల చేసిన ప్రెస్ నోట్ లో..

ఆ విశేషాలు ఆయన మాటల్లోనే…

చాలా నెలల తర్వాత మరో నిర్మాత అనురాగ్ కంచెర్ల ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకి వచ్చారు

ఇది తెలిసిన శేఖర్ రాజు తనకి డబ్బు వద్దని అసోసియేట్ ప్రొడ్యూసరుగా ఉంటానని అన్నాడు.. దానికి నేను అలా అయితే ప్రస్తుత ప్రొడ్యూసర్ అనురాగ్ కి తన మొత్త్తం పెట్టుబడి తిరిగి వఛ్చిన తర్వాతే నీ డబ్బు వస్తుందని చెప్పాను.. దానికి తాను ఒప్పుకున్నాడు

దాని తర్వాత ఫోన్ లో విసిగించడం మొదలు పెట్టాడు .. నేను నీ పేరు వేసి ట్రైలర్ రిలీజ్ అయిన 1 ఇయర్ తర్వాత ఇదేంటని అడిగాను
తర్వాత మే 2021 ప్రాంతంలో మియాపూర్ పోలీస్ స్టేషన్ లో నా మీద కంప్లైంట్ పెట్టాడు .. అప్పుడు నేను తనని పిలిపించి మల్లి ఒరిజినల్ గా మాట్లాడుకున్నవన్నీ గుర్తు చేశాను .. తను తనని ఎవరో ముగ్గురు ప్రేరేపిస్తున్నారని సారీ చెప్పి వెళ్ళిపోయాడు

ఫిలిం ఫైనల్ గా జనవరి 1st 2022 న రిలీజ్ అయ్యింది .. ముఖ్యమైన విషయం ఏమిటంటే జులై 2021 నుంచి జనవరి 1st 2022 రిలీజ్ డేట్ కూడా వదిలేసి ఏప్రిల్ 12 th వరకూ కూడా 10 మంత్స్ పాటూ నాకు మెసేజ్ గాని ఫోన్ కానీ చెయ్యలేదు .. హ్యాండ్ లోన్ దిశా రిలీజ్ రోజు ఇవ్వవలసి ఉంటే ఎందుకు చెయ్యలేదు ?

తర్వాత సడన్ గా మే 21st 2022 న కోర్ట్ లో అబద్ధపు స్టేట్మెంట్ ఇఛ్చి మియాపూర్ లో చీటింగ్ కేసు రిజిస్టర్ చెయ్యడానికి కోర్ట్ ద్వారా రిఫెరల్ తెచ్చుకున్నాడు .. దీన్ని ప్రేరేపించిన వాళ్ళు కూడా ఆ ముగ్గురే అయుండచ్చు

కోర్ట్ లో తనిచ్చిన అబద్ధపు స్టేట్మెంట్ ఏమిటంటే అసలు తనకి జనవరి 2021 వరకూ దిశా ఫిలిం కి ప్రొడ్యూసర్ నేను కాదు ,ఇంకెవరో అని తనకి తెలియదని , లోన్ కోసం నేనే ప్రొడ్యూసర్ అని నేను తనకి అబద్ధం చెప్పానని .. ఇలా అయితే చీటింగ్ కేసు పెట్టొచ్చ్చని ఆ ముగ్గుర ఫ్రాడ్లు ప్రేరేపించి ఉండచుచు

అసలు విషయమేమిటంటే నేను సెప్టెంబర్ 25 th 2020 తారీకునే తనకి పోస్టర్ , 26 th న ట్రైలర్ వాట్సాప్ లో పంపాను ..తను ఈ విషయం మీద వాయిస్ నోట్ ద్వారా , మెసేజ్ ద్వారా నేను చాలా హ్యాపీ అని నాకు రిప్లై ఇచ్చ్చాడు ..

సెప్టెంబర్ 26 th 2020 న పంపిన ఆ పోస్టర్ , ట్రైలర్ లో ప్రొడ్యూసర్ అనురాగ్ కంచర్ల అసోసియేట్ ప్రొడ్యూసర్ శేఖర్ రాజు అని క్లియర్ గా వుంది.. అలాంటప్పుడు నేను ప్రొడ్యూసర్ కాదని తనకి జనవరి 2021 వరకూ తెలియదని చెప్పడం కన్నా పెద్ద అబద్దముంటుందా ?

ఇదే కాకుండా సెప్టెంబర్ 26 th 2020 నుంచి మొదలుకుని జనవరి 1st 2022 ఫిలిం రిలీజ్ వరకూ ప్రతి పోస్టర్ ప్రతి ట్రైలర్ మీద ప్రొడ్యూసర్ అనురాగ్ కంచర్ల అసోసియేట్ ప్రొడ్యూసర్ శేఖర్ రాజు అనే వుంది

దీనికి సంబంధించిన కాల్ డేటా రికార్డ్స్ స్క్రీన్ షాట్స్ వాయిస్ నోట్స్ ని పోస్టర్స్ ని ట్రైలర్స్ ని అధికారులకి సమర్పించాం.. ఇప్పుడు మీ మీడియా కి కూడా విడుదల చేస్తున్నాము

చివరి విషయం శేఖర్ రాజు మొదట్లో తననెవరో ముగ్గురు ప్రేరేపిస్తున్నారని చెప్పిన విషయాన్ని బట్టి ఇవ్వాళ 28th మే న నేను చూసిన ఒక టీవీ న్యూస్ బట్టి , ఆ ముగ్గురిలో ఇవ్వాల నేను కేసు పెట్టిన నట్టి క్రాంతి , నట్టి కరుణ కూడా ఉన్నారేమో అని అనుమానం కలుగుతోంది .. ఎందుకంటె నట్టి క్రాంతి , నట్టి కరుణ వాళ్ళ ఫాదర్ , శేఖర్ రాజు పక్కన వున్నారు

నాకు తెలిసి,నట్టి క్రాంతి , నట్టి కరుణ ఫాదర్ కి , కోర్ట్ తో అబధ్ధామాడిన శేఖర్ రాజు కి మధ్య ఏప్రిల్ 2022 నుంచి ఇప్పటివరకూ చాలా కాల్స్ జరిగుంటాయి

దీని లోటు పాట్లు పరిశీలించి మా అడ్వొకేట్లు ఆ నలుగురి మీద ఫర్దర్ కేసులు ప్రిపేర్ చేస్తున్నారు .. దాంట్లో 120 B r/w 34 కామన్ ఇంటెంట్ కూడా వుండబోతోంది ..సినిమా ఇప్పుడే మొదలయ్యింది అని పేర్కొన్నారు రామ్ గోపాల్ వర్మ.