బ్యాంక్ ట్రాన్సాక్ష‌న్ ఫెయిలైందా.. రీఫండ్ వ‌చ్చే వ‌ర‌కు రోజుకు రూ.100 నష్టపరిహారం కావాలంటే ఇలా చెయ్యండి…

మరీ గ్రామీణ ప్రాంతాలు తప్పితే..చాలా ప్రాంతాల్లో ప్రజలు డిజిటల్ పేమెంట్ల వైపే మొగ్గు చూపుతున్నారు. దేశంలో పెద్ద నోట్ల రద్దు నుంచి డిజిటల్ పేమెంట్లవైపు జనాలు అడుగులు వేశారు. ప్రస్తుతం కరోనా సమయంలో డిజిటల్ పేమెంట్స్ చేసేవారి సంఖ్య మరింత పెరిగింది. నోట్లు ఇచ్చి, పుచ్చుకునే కన్నా డిజిట‌ల్ వాలెట్లు, మొబైల్ బ్యాంకింగ్‌, నెట్ బ్యాంకింగ్‌లు మేలు అని ప్రజలు డిసైడయ్యారు. దీంతో డిజటల్ ట్రాన్సాక్ష‌న్ల సంఖ్య అమాంతం పెరిగిపోయింది. టీ తాగినా, టిఫిన్ చేసినా కూడా యూపీఐ పేమెంట్లు చేసేస్తున్నారు. అయితే బ్యాంకుల సర్వ‌ర్ల‌లో వ‌స్తున్న సాంకేతిక స‌మ‌స్య‌లు వారిని ఇబ్బంది పెడుతున్నాయి. ఆన్‌లైన్ ట్రాన్సాక్ష‌న్లు ఎక్కువ‌గా ఫెయిల‌వుతున్నాయి. టెక్నాలజీ అప్ గ్రేడ్ విషయంలో ఎందుకో బ్యాంకులు ముందడుగు వేయడం లేదు. దీంతో క‌స్ట‌మ‌ర్లు తీవ్ర ఇబ్బందుల‌కు గుర‌వుతున్నారు.

అయితే బ్యాంకులు ఇలాంటి విషయాలలో కాస్త ఒళ్లు దగ్గరపెట్టి పనిచేసేలా బ్యాంకులకే బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఇండియా 2019 సెప్టెంబ‌ర్ 20 నుంచే ఒక నిబంధనను అమ‌లు చేస్తోంది. బ్యాంకుల‌కు సంబంధించి వినియోగదారులు ఆన్‌లైన్ లావాదేవీలు చేస్తే ఏదైనా ట్రాన్సాక్ష‌న్ ఫెయిల్ అయితే 7 రోజుల్లోగా బ్యాంకులు డబ్బను రీ ఫండ్ చెయ్యాలి. ఒకవేళ 7 రోజులు దాటాక కూడా రీఫండ్ రాని ప‌క్షంలో వినియోగదారులు ఆ రీఫండ్ వ‌చ్చే వ‌ర‌కు రోజుకు రూ.100 న‌ష్ట‌ప‌రిహారం పొంద‌వ‌చ్చు. నష్టపరిహారం కోసం ఏం చెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆన్‌లైన్ ట్రాన్సాక్ష‌న్ ఫెయిల్ అయిన 7 రోజుల్లోగా డ‌బ్బులు తిరిగి అకౌంట్‌లో క్రెడిట్ అవక‌పోతే వినియోగదారులు త‌మ బ్యాంక్‌కు చెందిన బ్రాంచికి వెళ్లి అక్క‌డ అనెక్షర్ 5 ఫారంను ఫిల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. ఆ త‌రువాత రీఫండ్ వ‌చ్చే వ‌ర‌కు రోజుకు రూ.100 చొప్పు అద‌న‌పు న‌ష్ట ప‌రిహారాన్ని బ్యాంకులు వినియోగదారులకు చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు అలా చేస్తే..సదరు బ్యాంకు మీ సమస్యను వెంటనే పరిష్కరించడానికి ప్రయత్నాలు చేస్తాయి. ఈ విష‌యం గురించి చాలామందికి అవగాహన ఉండదు. కాబట్టి మీకు తెలిసిన రీ ఫండ్ బాధితులు ఎవ‌రైనా ఉంటే..లేకపోతే మీరే ఎప్పుడైనా బాధితుడిగా మారితే ఈ స‌దుపాయాన్ని ఉప‌యోగించుకోవ‌చ్చు.Bank to pay you Rs 100 per day penalty for delay in transaction beyond these limits, Failed ATM transaction, Bank information, bank alerts, penalty to banks, digital payments, బ్యాంకు రీఫండ్, బ్యాంకు లావాదేవీలు, బ్యాంకు వడ్డీ రేట్లు