మనలో చాలామంది జాజికాయల గురించి ఏదో ఒక సందర్భంలో వినే ఉంటారు. జాజికాయల పొడి వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది. జాజికాయల పొడిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుందనే సంగతి తెలిసిందే. ఉబ్బరం, గ్యాస్, అజీర్ణం సమస్యలకు చెక్ పెట్టే విషయంలో ఈ పొడి తోడ్పడుతుంది. ఈ పొడిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్రీ రాడికల్స్ మెదడు కణాలను రక్షించడంలో తోడ్పడతాయి.
జాజికాయ తీసుకోవడం ద్వారా కండరాల నొప్పి సైతం దూరమవుతుందని చెప్పవచ్చు. జాజికాయలో ఉండే మెగ్నీషియం, మిరిస్టినిన్ ఒత్తిడిని దూరం చేసే విషయంలో సహాయపడతాయి. జాజికాయ పొడిలో ఉండే యాంటీ మైక్రోబయల్ లక్షణాలు నోటి దుర్వాసనకు సులువుగా చెక్ పెడతాయని కచ్చితంగా చెప్పవచ్చు. జాజికాయ తీసుకోవడం ద్వారా గుండె సంబంధిత సమస్యలు సులువుగా దూరమవుతాయి.
జాజికాయ పొడి తీసుకోవడం ద్వారా మలబద్ధకం, విరేచనాలు, గ్యాస్ సమస్యలు తగ్గుతాయి. శరీరంలోని ద్రవ్యాలను బ్యాలెన్స్ చేయడంలో ఇవి సహాయపడతాయి. రక్తనాళాల్లో పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో ఇది తోడ్పడుతుంది. దంత సమస్యలను తొలగించడంలో ఈ పొడి ఉపయోగపడుతుంది. లివర్, కిడ్నీలలో పేరుకుపోయిన వ్యర్థాలను సైతం ఇది తగ్గిస్తుంది.
నిద్రలేమి సమస్యతో బాధ పడేవారు జాజికాయ పొడి తీసుకోవడం ద్వారా రాత్రి సమయంలో ప్రశాంతంగా నిద్ర పోవచ్చు. కీళ్ల నొప్పులు, కీళ్ల వాపులను తగ్గించడంలో ఇందుకు సంబంధించిన నూనె ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. ఇందులో కాల్షియం, ఐరన్, మాంగనీస్, పొటాషియం పుష్కలంగా ఉంటాయని చెప్పవచ్చు.