Shyamala: ఫోన్లు చేసి నీ రేటెంతనీ అడుగుతున్నారు… డిప్యూటీ సీఎంని ప్రశ్నించిన శ్యామల?

Shyamala: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా దుర్వినియోగ రక్షణ బిల్లును తీసుకువస్తామని చెప్పారు. ఈ క్రమంలోనే యాంకర్ శ్యామల ఈ విషయం గురించి ప్రెస్ మీట్ పెట్టారు. డిప్యూటీ సీఎం గారు సోషల్ మీడియా దుర్వినియోగ రక్షణ బిల్లును తీసుకువస్తామని చెప్పారు. ఆ రక్షణ బిల్లు ఎవరికోసం అంటూ ఈమె ప్రశ్నించారు. కూటమి నేతల గురించి అభ్యంతరకరంగా మాట్లాడిన వారిని అరెస్టు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే సోషల్ మీడియాలో తన గురించి ఎంతో అసభ్యకరంగా మాట్లాడుతూ పోస్ట్ చేసిన వారి పట్ల చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.

తన పర్సనల్ నెంబర్ ను కొందరు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రతిరోజు తక్కువలో తక్కువ తొమ్మిది వందల మిస్డ్ కాల్స్ వస్తున్నాయని తెలిపారు. మరి కొంతమంది ఫోన్లు చేసి నీ రేటెంత అంటూ దారుణంగా మాట్లాడుతున్నారని యాంకర్ శ్యామల వాపోయారు. ఇలా చౌకబారుగా సోషల్ మీడియాను దుర్వినియోగం చేసిన వీరిని ఏం చేయాలని ప్రశ్నించారు.

తన కుటుంబం, తన భర్తను కూడా కేవలమైన దిగజారుడు మాటలతో కామెంట్లు చేస్తున్నారు. ఫోన్ తీయాలని, వాడరాని భాష వాడుతూ వేధిస్తున్నారని ఈమె కామెంట్లు చేశారు.ఇలా ఒక్కసారిగా ఐక్యంగా తనపై వేధింపులకు పాల్పడుతున్న వారు నేరాలు చేసే వారిని అదుపులోకి తీసుకునే అంశంపై ఒక్కటైతే బాగుంటుందని.. అలా చేసి వుంటే ఆడపిల్లలపై అత్యాచారాలు జరిగేవి కాదని ఎంతోమంది తల్లులకి కడుపుకోత మిగిలేది కాదని తెలిపారు.

ఈ దారుణాలపై ఏపీలోని కూటమి నేతలు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారని ఈమె ప్రశ్నించారు. ముఖ్యంగా నారా లోకేష్ గారి యువగళం పాదయాత్రను స్ఫూర్తిగా తీసుకొని నాకు ఇలాంటి ఫోన్ కాల్స్, దారుణమైనటువంటి పోస్టులు వస్తున్నాయి అంటూ ఈ సందర్భంగా ప్రెస్ మీట్ కార్యక్రమంలో శ్యామల చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.