KTR: కేటీఆర్ అరెస్టుకు వెనకడుగు వేస్తున్న కాంగ్రెస్… అదే ప్రధాన కారణమా?

KTR: కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకుంటున్నటువంటి అనూహ్య నిర్ణయాల పట్ల బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకత చూపుతోంది. ఎప్పటికప్పుడు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ సోషల్ మీడియా వేదికగా సంచలనమైన పోస్టులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ ఆయనని అరెస్టు చేయాలని భావించారు.

ఈ విషయం గురించి ఒకానొక సందర్భంలో కాంగ్రెస్ మంత్రులు కూడా మీడియా సమావేశాలలో బయటపెట్టారు. త్వరలోనే తెలంగాణలో దీపావళి బాంబ్ బ్లాస్ట్ కాబోతుందని వెల్లడించారు అయితే కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ ఆయనని ఏ కేసులోనైనా ఇరికించి అరెస్టు చేయాలని కొందరు కాంగ్రెస్ నేతలు ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.

ఈ క్రమంలోనే గత పది సంవత్సరాల కాలంలో కేటీఆర్ ఏ విధమైనటువంటి స్కాములు చేశారనే విషయాలపై కూడా ఆరా తీస్తున్నారు ఈ క్రమంలోనే ఫార్ములా ఈ రేస్ నిధుల విడుదల నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని.. కేటీఆర్‌ అడ్డంగా బుక్కయ్యారని అరెస్ట్ చేయాలని పార్టీ నేతల నుంచి డిమాండ్ వచ్చింది అలాగే జన్వాడ ఫామ్ హౌస్ పార్టీ విషయంలో కూడా కేటీఆర్ డ్రగ్స్ వాడారని ఈయనని అరెస్టు చేయాలి అంటూ కూడా కొందరు డిమాండ్లు చేశారు.

ఇక ఈ విషయం గురించి పూర్తి సమాచారం రాకుండానే లగచర్ల గ్రామ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ గ్రామస్తులు అధికారులపై దాడి చేయడంతో ఈ దాడి వెనుక కేటీఆర్ హస్తం ఉందని ఆయనని అరెస్టు చేయాలి అంటూ వాదనలు వినిపించాయి. ఇలా కేటీఆర్ అరెస్టు చేయాలంటూ డిమాండ్లు వస్తున్న ప్రభుత్వం మాత్రం వెనకడుగు వేస్తుంది ఇలా వెనకడుగు వేయడానికి కూడా కారణం లేకపోలేదని చెప్పాలి.

లగచర్ల అధికారులపై దాడి ఘటనలో భాగంగా కేటీఆర్ ను కనుక అరెస్టు చేస్తే కాంగ్రెస్ పార్టీకే పెద్ద ఎఫెక్ట్ పడుతుందని రేవంత్ రెడ్డి పునరాలోచన చేస్తున్నట్టు సమాచారం లగచర్ల ఘటన రైతులతో ముడిపడి ఉన్న అంశం ముఖ్యంగా ఎస్టీ లంబాడి రైతులతో ఈ అంశం ముడిపడి ఉన్న నేపథ్యంలో ఇప్పుడు కేటీఆర్ ను అరెస్టు చేస్తే బిఆర్ఎస్ పార్టీపై వారికి సానుభూతి కలుగుతుందని అది కాంగ్రెస్ పార్టీకి ప్రమాదమనే ఆలోచన చేసిన రేవంత్ రెడ్డి కేటీఆర్ ని అరెస్ట్ చేయడానికి వెనకడుగు వేస్తున్నట్టు సమాచారం.