Keerthy Suresh: సీనియర్ నటి మేనక ప్రముఖ నిర్మాత సురేష్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు నటి కీర్తి సురేష్. ఈమె తెలుగులో నేను శైలజ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి తన అమాయకమైన చూపులతో అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. ఇలా తెలుగు తమిళ భాష చిత్రాలలో అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా బిజీగా ఉండటమే కాకుండా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.
ఇలా సౌత్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న కీర్తి సురేష్ మహానటి సావిత్రి బయోపిక్ చిత్రంలో నటించి ఏకంగా నేషనల్ అవార్డును కూడా సొంతం చేసుకున్నారు.. ఇక ప్రస్తుతం ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలోకి కూడా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పలు బాలీవుడ్ సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్న కీర్తి సురేష్ పెళ్లి గురించి తరచూ సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
ఈమె పెళ్లి గురించి ఇప్పటికే ఎన్నో రకాల వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ వార్తలపై కీర్తి సురేష్ ఎన్నో సందర్భాలలో స్పందిస్తూ ఆ వార్తలను ఖండించారు అలాగే తన తండ్రి సురేష్ కూడా కీర్తి పెళ్లి వార్తలపై స్పందించి అలాంటి వార్తలని అవాస్తవమని ఒకవేళ పెళ్లి చేస్తే తామే ఈ విషయాన్ని అందరితో ముందుగా పంచుకుంటామని తెలిపారు. ఇదిలా ఉండగా గత రెండు రోజులుగా మరోసారి కీర్తి సురేష్ పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈమె తన స్నేహితుడు ఆంటోని తట్టిల్ అని వ్యక్తితో గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారని తెలుస్తుంది. సుమారు 15 సంవత్సరాల పాటు వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని ఈ క్రమంలోనే పెద్దల సమక్షంలో ఇద్దరు వచ్చేనెల డిసెంబర్ 11,12 వ తేదీలలో వీరి వివాహం గోవాలో ఎంతో ఘనంగా జరగబోతుందని తెలుస్తుంది. ఇక ఆంటోని దుబాయ్ లో వ్యాపారాలను చూసుకుంటూ అక్కడే స్థిరపడినట్టు సమాచారం. మరి కీర్తి సురేష్ ఆంటోనీ పెళ్లి గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాలి అంటే కీర్తి సురేష్ అధికారికంగా స్పందించాల్సి ఉంది.