గజ్జల్లో దురద వల్ల ఇబ్బందులు పడుతున్నారా.. సమస్యకు చెక్ పెట్టే అద్భుత చిట్కాలివే!

వయస్సుతో సంబంధం లేకుండా చాలామందిని వేధించే ఆరోగ్య సమస్యలలో గజ్జల్లో దురద సమస్య కూడా ఒకటని చెప్పవచ్చు. ఈ సమస్య వల్ల ఎదురయ్యే ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. ఈ సమస్యకు చాలా సందర్భాల్లో క్లమిడియా అనే వైరస్ కారణమవుతుంది. 25 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న చాలామంది వ్యక్తులలో ఈ సమస్య వస్తుందని చెప్పవచ్చు. హ్యుమన్ పపిల్లోమా వైరస్ వల్ల కూడా ఈ సమస్య వచ్చే ఛాన్స్ ఉంటుంది.

లేజర్ ట్రీట్మెంట్ ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. వృషణాలు, దాని చుట్టుపక్కల దురద ఎక్కువగా ఉంటే సలిపి అనే సమస్య కారణమవుతుంది. వైద్యులు సూచించే మందులు వాడితే ఈ సమస్య దూరమయ్యే అవకాశాలు ఉంటాయి. మార్మాంగం, యోని నుంచి విడుదలయ్యే ద్రవాల వల్ల గోనేరియా అనే వ్యాధి వస్తుంది. ఈ సమస్య విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సంతానానికి సంబంధించిన సమస్యలు వస్తాయి.

సెక్స్ తర్వాత మర్మాంగాలను శుభ్రం చేసుకోకుండా వదిలేసినా ఫంగస్ ఏర్పడే అవకాశాలు ఉంటాయి. యాంటీ ఫంగల్ క్రీమ్‌లతో ఈ ఫంగస్‌ కు చెక్ పెట్టవచ్చు. డెర్మటోఫైట్ అనే ఒక రకమైన ఫంగస్ వల్ల జాక్ అనే సమస్య వస్తుంది. యాంటీ ఫంగల్ క్రీమ్‌ల ద్వారా దీని నుంచి ఉపశమనం లభించే అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు. మానవ శరీరంపై ఉండే వెంట్రుకల్లో నివసించే అతి సూక్ష్మ పేనులు క్రాబ్స్, ప్యూబిక్ లైస్ సమస్యకు కారణమవుతాయి.

ఎలర్జీలు కలిగించే డిటర్జెంట్స్‌‌ మర్మాంగాల వద్ద ఉపయోగిస్తే శరీరం ఎర్రగా, పొడిగా మారుతుంది. ఈ సమస్య వస్తే వాషింగ్ పౌడర్ ను మార్చాల్సి ఉంటుంది. అండర్ వేర్ పరిశుభ్రంగా లేకున్నా, లేదా బిగువుగా ఉన్నా గజ్జల్లో దురద సమస్య వస్తుంది బిగుతైన దుస్తులు ధరించే వాళ్లు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి.