YS Jagan: వైయస్ జగన్మోహన్ రెడ్డి 2024 అసెంబ్లీ ఎన్నికలలో కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితమయ్యారు ఇలా తన పార్టీ ఘోరంగా ఓటమి పాలు కావడంతో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది అయితే ఎమ్మెల్యేగా గెలిచిన ఈ 11 మంది తప్పనిసరిగా అసెంబ్లీకి వెళ్లాల్సి ఉంటుంది. ఇలా జగన్మోహన్ రెడ్డి మాత్రం అసెంబ్లీలోకి అడుగు పెట్టడానికి ఇష్టపడటం లేదు.
తనకు ప్రతిపక్ష నేతగా హోదా ఇస్తేనే అసెంబ్లీలోకి వెళ్తానని ఈయన భీష్ముంచుకొని కూర్చున్నారు. ఇలా ప్రతిపక్ష హోదా కోసం కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ విధంగా జగన్ అసెంబ్లీకి రాకపోవడం పట్ల ఎంతోమంది తెలుగుదేశం పార్టీ నేతలు మంత్రులు ఆయనపై విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే గతంలో వైసీపీ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలోకి వెళ్లి ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.
ఈ సందర్భంగా ఆయన అసెంబ్లీలో జగన్ అసెంబ్లీకి రాకపోవడం గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. జగన్మోహన్ రెడ్డిని చూసి చాలా కాలం అవుతుంది. ఆయనని ఒకసారి చూడాలనిపిస్తుంది ఒక్కసారి అసెంబ్లీకి వస్తే బాగుంటుందని తెలిపారు.. ఇక జగన్ అసెంబ్లీకి రావాలంటే ఆయనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక చిన్న చిట్కా పాటిస్తే చాలు ఆయనే అసెంబ్లీలోకి అడుగు పెడతారు.
జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలోకి రావాలి అంటే స్పీకర్ గారు ఒక గంట పాటు మైక్ కట్ చేయకుండా ఆయనకు ఇస్తే చాలు ఈ క్షణమే ఆయన అసెంబ్లీలోకి అడుగు పెడతారు అంటూ శ్రీధర్ రెడ్డి సెటైర్లు వేశారు. వైయస్ జగన్ గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు తనకు మైక్ కోసమే మమ్మల్ని పోరాటం చేయమని చెప్పేవారు. అందుకే ఆయనకు ఒక గంట మైక్ ఇస్తే చాలు అసెంబ్లీలోకి అడుగు పెడతారు అంటూ ఈయన సెటైర్లు పేల్చారు. జగన్మోహన్ రెడ్డి ఏ విషయమైనా ఆయనే మాట్లాడాలనుకుంటారు వేరే వారికి అవకాశం ఇవ్వరు గతంలో పాదయాత్రకు వెళ్లే సమయంలో ఈ బాధ్యతలను బుగ్గన రాజేంద్రనాథ్ కి ఇవ్వచ్చు కానీ అలా ఇవ్వకుండా ఆయన అసెంబ్లీలోకి అడుగుపెట్టకుండా వెళ్ళిపోయారు అంటూ అప్పటి విషయాలను కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గుర్తు చేస్తూ జగన్మోహన్ రెడ్డి పట్ల చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.