YS Sharmila: వైయస్ షర్మిల ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా పదవి బాధ్యతలను తీసుకున్న తర్వాత ఈమె రాష్ట్రంలో వైకాపా కూటమి ప్రభుత్వంపై సంచలనమైన ఆరోపణలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల ఏపీ అసెంబ్లీ సమావేశాలలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మహిళల పట్ల జరుగుతున్న అక్రమాల గురించి అత్యాచారాల గురించి వైకాపా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వివరణ అడిగారు. ఈ క్రమంలోనే హోం మంత్రి అనిత గత ఐదు సంవత్సరాల కాలంతో పోలిస్తే మా ప్రభుత్వ హయామంలో క్రైమ్ రేట్ పూర్తిగా తగ్గిపోయిందని తెలిపారు.
ఇలా మహిళలపై జరుగుతున్న దాడుల గురించి అత్యాచారాల గురించి అసెంబ్లీలో వాదోపవాదనలు జరిగాయి. ఈ క్రమంలోనే ఈ విషయంపై వైయస్సార్ షర్మిల సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ సంచలన పోస్ట్ చేశారు. మహిళల రక్షణ విషయంలో గత పది సంవత్సరాలుగా టీడీపీ వైకాపా పూర్తిగా విఫలమైందని తెలిపారు. ఈ రోజు శాసనమండలిలో జరిగిన చర్చనే ఇందుకు నిదర్శనమన్నారు. 2014 నుంచి 19 వరకు రాష్ట్రంలో నమోదైనవి 83,202 కేసులట.. 2019 నుంచి 24 వరకు 1,00,508 కేసులట.. అంటూ ఫైర్ అయ్యారు.
ఇలా మహిళల గురించి శాసనమండలిలో వాదోపవాదనలు చేసుకుంటూ మహిళల మానప్రాణాలతో రాజకీయాలు చేస్తున్నారని ఈమె మండిపడ్డారు. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండి మహిళలపై జరుగుతున్న అన్యాయాలనే ఎదుర్కోవడానికి నిర్భయ చట్టాన్ని తీసుకువచ్చారు. ఇక 2019 నుంచి అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఏకంగా దిశ యాప్ తీసుకువచ్చారు.
ఇలా నిర్భయ చట్టం కింద నిందితుడికి 40 రోజులలో శిక్ష పడేలా చర్యలు తీసుకుంటుందని చంద్రబాబు చెప్పగా దిశ చట్టం కింద నిందితులకు కేవలం 20 రోజులలోనే శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామంటూ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఇలా మహిళల రక్షణ గురించి వీరు చట్టాలను తీసుకువచ్చిన ఆ చట్టాలు కేవలం మాటల వరకు ఉన్నాయని చేతలలో లేవని మాటలతో మహిళల చెవుల్లో క్యాలీఫ్లవర్ పెట్టారు అంటూ షర్మిల తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ చేసిన ఈ పోస్టు వైరల్ అవుతుంది.
మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు , అఘాయిత్యాలను అరికట్టడంలో గత 10 ఏళ్లుగా @JaiTDP టీడీపీ, వైసీపీ @YSRCParty ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయి. ఇవ్వాళ శాసనమండలిలో జరిగిన చర్చనే ఇందుకు నిదర్శనం. 2014 నుంచి 19 వరకు రాష్ట్రంలో నమోదైనవి 83,202 కేసులట. 2019 నుంచి 24 వరకు 1,00,508 కేసులట.…
— YS Sharmila (@realyssharmila) November 18, 2024