G zombie movie review : జీ జాంబీ రివ్యూ & రేటింగ్!

g-zombie-movie-review

జీ జాంబీ.. ఓ హానెస్ట్ అటెంప్ట్

స్టోరీ:ఓ మెడికల్ ప్రొఫెషనల్స్ టీం ఇమ్యూనిటీ బూస్టర్ వ్యాక్సిన్ లాంచ్ చేయాలని అనుకుంటుంది. దీనికోసం ఓ ఇంజినీరింగ్ కాలేజీలో పరిశోధనలు ప్రారంభిస్తుంది. క్లినికల్ ట్రయల్స్ కోసం జంతువులకు బదులుగా.. జీవితఖైదు పడిన క్రిమినల్స్ ని వినియోగిస్తారు. వ్యాక్సిన్ ఇచ్చాక అది ఫెయిల్ అవుతుంది. వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లు జాంబీలుగా మారతారు. తర్వాత, ఆ ఇన్ఫెక్షన్ అక్కడున్న ఇతరులకు వ్యాపిస్తుంది. అయితే.. డాక్టర్ రుద్ర, అతని గర్ల్ ఫ్రెండ్ సారా మరికొందరు ఎలా ఆ ప్రమాదకరమైన పరిస్థితుల నుంచి తప్పించుకున్నారు అనేదే స్టోరీ.

g-zombie-movie-review
g-zombie-movie-review

పాజిటివ్ అంశాలు:
ఆర్యన్ గౌర ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్
ఎమోషనల్ సీన్లు
అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్
ఆసక్తిరేకెత్తించే ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్

అనాలసిస్:
సినిమా ప్రారంభంలో స్లోగా లవ్ ట్రాక్ తో మొదలైనా.. కాసేపట్లోనే రోలర్ కోస్టర్ లాగా థ్రిల్లింగ్ సీన్లతో పీక్స్ కు తీసుకెళ్తుంది. ఆర్యన్ గౌర, దీపు డైరెక్షన్ అద్భుతంగా ఉన్నాయనే చెప్పాలి. మెస్మరైజింగ్ స్క్రీన్ ప్లేకి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఆర్యన్ గౌరాకు ఇది మొదటి మూవీ అయినా.. ఎక్కడా అది కనిపించదు. చాలా మెచూర్డ్ నటుడిగా రుద్ర క్యారెక్టర్ తో మెప్పించాడు. అద్భుతమైన ఎనర్జీ లెవల్స్ తో క్యారెక్టర్ కి పర్ ఫెక్ట్ గా న్యాయం చేశారు. మొత్తంగా జాంబీ మూవీ.. కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఉన్న ఓ గ్రేట్ మూవీ అనే చెప్పాలి.
రేటింగ్ : 3/5