జాంబీ వైరస్ కాన్సెప్ట్ తో వచ్చిన సినిమా ‘జీ జాంబీ’. ఫిబ్రవరి 5 న థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమాను మహిళా దర్శకురాలు దీపిక దర్శకత్వం వహించారు. త్వరలో అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా విడుదల కానుంది.
ఈ సందర్భంగా హీరో ఆర్యన్ గౌర, డైరెక్టర్ దీపికా మాట్లాడుతూ…
మా లాంటి కొత్త వారితో కొత్త కాన్సెప్ట్ తో అడిగినంత డబ్బు పెట్టి సినిమా తీసిన నిర్మాత సూర్య గారికి ధన్యవాదాలు. ఇలాంటి కొత్త నిర్మాతలు ఎందరో రావాలి. థియేటర్ లో ఈ సినిమా మిస్ అయ్యామని ఫీల్ అయ్యే ప్రేక్షకులు త్వరలో ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ లో చూడవచ్చు. మేము తీసిన ఈ ప్రయత్నానికి ప్రేక్షకులు బాగా ఆదరించారు. ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా హీరోగా వచ్చిన నన్ను సపోర్ట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. కాన్సెప్ట్ కొత్తగా ఉంటే మేమున్నామని ప్రేక్షకులు మా జీ జాంబీ సినిమాను ఆదరించారు. థియేటర్ లో మా సినిమా ను ఇంత పెద్ద సక్సెస్ చేసిన మీ అందరికి రుణపడి ఉంటాను. చిన్న ఊర్లలో మా సినిమా రిలీజ్ కానప్పటికీ సిటీస్ కి వచ్చి సినిమా చూసిన ఆడియన్స్ కు ధన్యవాదాలు. రెస్పాన్స్ చూస్తుంటే మా కష్టం మర్చిపోయాం. ఇలాగే కొత్త వారిని ఎప్పుడూ సపోర్ట్ చెయ్యాలని కోరుకుంటున్నాము. అమెజాన్ లో మా సినిమాను చూడండి అందరికి షేర్ చెయ్యండి. అమెజాన్ లాంటి పెద్ద సంస్థ మా సినిమాను తీసుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు.
నటీనటులు:
ఆర్యన్ గౌర, దివ్య పాండే, రాజశేఖర్, బొంబాయి పద్మ తదితరులు.
సాంకేతిక నిపుణులు:
డైరెక్టర్స్: ఆర్యన్, దీపికా
కెమెరామెన్: రాజశేఖర్
మ్యూజిక్: వినోద్ కుమార్ (విన్ను)
లిరిక్స్: రాంబాబు గోసాల
కో డైరెక్టర్: పవన్
అసోసియేట్ డైరెక్టర్: జన్న ప్రసాద్
అసిస్టెంట్ డైరెక్టర్స్: నరేష్, లోకేష్
పబ్లిసిటీ డిజైనర్: చందు