Bheemla Naik:భీమ్లా నాయక్ సినిమాను మిస్ చేసుకున్న యువ దర్శకుడు..కారణం ఏమిటో తెలుసా?

 

Bheemla Naik:బీమ్లా నాయక్ సినిమా రిలీజ్ అయిన రోజు నుండి అటు అభిమానుల సందడి ఇటు సినీ తారల స్పందనలతో రోజు వార్తల్లో నిలుస్తోంది. మహేష్ బాబు తో మొదలు చాలా మంది సెలబ్రిటీస్ భీమ్లా నాయక్ కు ఆల్ ది బెస్ట్ చెప్పడం, సినిమా లో పవన్ కళ్యాణ్, రానా ల నటన ను ప్రశంసించడం కామన్ అయిపోయింది.ఇక భీమ్లా నాయక్ థియేటర్స్ దగ్గర సందడి నెలకొంది.ఓవర్సీస్ లోను అదరగొడుతోంది. ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ పాయింట్ కి చేరుకుంది.తమిళ హిట్ మూవీ అయ్యప్పనుమ్ కోషియుమ్ సినిమాకు తెలుగు రీమేక్ గా వచ్చిన ఈ సినిమా పవన్ కళ్యాణ్ అభిమానులందరికీ  పండగే అని చెప్పొచ్చు.

ఈ సినిమ ఈ విషయంలో సాగర్ కే చంద్ర కూడా మంచి ప్రశంసలు అందుకున్నాడు. కానీ త్రివిక్రమ్ మొదట ఈ సినిమాని రీమేక్ చేయాలనుకున్నప్పుడు మొదట ఆయన ఈ దర్శకత్వ బాధ్యతల్ని యువ దర్శకుడు అయిన వివేక్ ఆత్రేయకు అప్పగించాలి అనుకున్నాడట. కానీ వివేక్ ఆత్రేయ నాని సినిమా తో బిజీగా ఉండడం వల్ల ఈ అవకాశాన్ని బదులు కొన్నాడట.ప్రస్తుతం వివేక్ ఆత్రేయ నాచురల్ స్టార్ నాని తో ‘అంటే సుందరానికి’ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.మెంటల్ మదిలో, బ్రోచెవారెవరురా వంటి సినిమాలను తెరకెక్కించిన వివేక్ ఆత్రేయ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఆ తర్వాత త్రివిక్రమ్ “అప్పట్లో ఒకడుండేవాడు” వంటి సినిమా తీసిన సాగర్.కె.చంద్రను ఫైనలైజ్ చేశాడు.ఈ సినిమాను సాగర్ కె.చంద్ర అద్భుతంగా తెరకెక్కించాడంటూ విమర్శకుల నుంచి ప్రశంసలు కూడా వచ్చాయి.