Vaishnav Tej: మెగా కాంపౌండ్ నుంచి హీరోగా తెలుగు చలన చిత్ర పరిశ్రమకు హీరో వైష్ణవ్ తేజ్ పరిచయం అయ్యారు. మొదటి సినిమా ఉప్పెన తోనే ఒక మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. రెండో చిత్రం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో వచ్చిన కొండపొలం. ఒక నవల ఆధారంగా రూపొందించిన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా అలరించ లేకపోయింది. దీంట్లో వైష్ణవ్ తేజ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ నటించారు. ప్రస్తుతం వైష్ణవ తేజ్ నుంచి మూడో సినిమా రాబోతోంది.
శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్‌పి బ్యానర్‌పై రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘రంగరంగ వైభవంగా!’ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.బాపినీడు బి సమర్పణలో గిరీశాయ దర్శకుడిగా బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కేతికా శర్మ హీరోయిన్.తమిళంలో ‘అర్జున్ రెడ్డి’ చిత్రాన్ని తెరకెక్కించిన గిరీశాయ లవ్, ఎంటర్‌టైన్‌మెంట్ ఎలిమెంట్స్ కలగలిసిన ఫ్యామిలీ డ్రామాగా దీనిని రూపొందిస్తున్నారు.ఇటీవల విడుదలైన ఈ మూవీ టైటిల్ టీజర్, పాటకు ఆడియెన్స్ నుంచి మంచి ఆదరణ లభిస్తోంది.
అయితే ఈ సినిమాను మొదట మే 27న విడుదల చేయబోతున్నట్టు నిర్మాత ఇప్పటికే ప్రకటించారు. అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమా రిలీజ్ ను జూలై 1కి పోస్ట్ పోన్ చేశారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి భారీ స్థాయిలో మూవీని రిలీజ్ చేస్తామని నిర్మాత ప్రసాద్ తెలిపారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. వైష్ణవ్ తేజ్ నుంచి వస్తున్న ఈ మూడో సినిమా ప్రేక్షకులను ఎలా అలరిస్తుందో చూడాలి.
