అమ్మో..TV 9 దేవి నాగవల్లి నెలకు ఇంత మొత్తంలో సంపాదిస్తుందా..?

టీవీ9 లో న్యూస్ రీడర్ గా పనిచేస్తున్న దేవి నాగవల్లి గురించి తెలియని వారంటూ ఉండరు. సుదీర్ఘ కారణంగా న్యూస్ రీడర్ గా పనిచేస్తున్న దేవి నాగవల్లి అప్పుడప్పుడు వివాదాల్లో చిక్కుకొని వార్తల్లో నిలుస్తోంది. దేవి నాగవల్లి ఒక న్యూస్ రీడర్ అయినప్పటికీ ప్రస్తుత కాలంలో ఉన్న సోషల్ మీడియా ద్వారా ఆమె మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇలా పాపులర్ అవ్వటం వల్ల బిగ్ బాస్ రియాలిటీ షో లో కూడా అవకాశం దక్కించుకుంది. అయితే నాగవల్లి కొంతకాలానికి బిగ్ బాస్ నుండి బయటకు రావాల్సి వచ్చింది.

బిగ్ బాస్ షో కి వెళ్లడం వల్ల దేవి నాగవల్లి పాపులారిటీ మరింత పెరిగింది. హౌస్ నుండి బయటికి వచ్చిన తర్వాత టీవీ9 లో న్యూస్ రీడర్ గా తన విధులు నిర్వహిస్తోంది. అయితే చాలామంది బిగ్ బాస్ కి వెళ్లినవారు మా టీవీ వారి ఒప్పందం ప్రకారం ఏడాది కాలం పాటు వారు చెప్పిన షోస్ లో మాత్రమే పాల్గొనాలి. కానీ నాగవల్లి మాత్రం బిగ్ బాస్ నుండి బయటకి వచ్చిన వెంటనే టీవీ నైన్ లో న్యూస్ రీడర్ గా జాయిన్ అయింది. ఇక దేవి నాగవల్లి ఇలా న్యూస్ రీడర్ గా బిజీగా ఉన్న కూడా సోషల్ మీడియా లో చాలా యాక్టివ్ గా ఉంటుంది. సోషియల్ మీడియాలో తన ఫోటోలతో పాటు దేశంలో జరిగే వార్తలను కూడా షేర్ చేస్తూ ఉంటుంది.

ఇలా సోషియల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ఇదిలా ఉండగా న్యూస్ రీడర్ గా ఫేమస్ అయిన దేవి నాగవల్లి నెల సంపాదన గురించి సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. టీవీ9 లో న్యూస్ రీడర్గా పనిచేసినందుకుగాను దేవి నాగవల్లి నెలకు రూ.2 రెండు లక్షల వరకు జీతం అందుకుంటున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇక సోషల్ మీడియా ద్వారా కూడా దాదాపు నెలకు రూ. 50 వేల రూపాయలు సంపాదిస్తున్నట్లు సమాచారం. ఇలా మొత్తం నెలకు రూ. 2.50 లక్షల వరకూ సంపాదిస్తున్నట్లు సమాచారం.