మహేష్ తో క్రేజీ సీక్వెన్స్ ప్లాన్ చేస్తున్న గురూజీ.!

టాలీవుడ్ ఎవర్ గ్రీన్ చార్మింగ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు నుంచి గ్లోబల్ వైడ్ గా అయితే తన క్రేజ్ అండ్ మార్కెట్ ని విస్తరించే ప్లాన్ చేసుకుంటున్నాడు. మరి మహేష్ కి తన లుక్ తో ఎప్పుడు నుంచో హాలీవుడ్ లెవెల్ చార్మింగ్ ఉందని టాక్ ఉంది.

దీనితో తన ఇంటర్నేషనల్ లెవెల్ ఎంట్రీ కోసం ఎప్పుడు నుంచో చాల మంది ఎదురు చూస్తున్నారు. కాగా ఇప్పుడు అయితే దర్శకుడు త్రివిక్రమ్ తో ఆల్ మోస్ట్ హాలీవుడ్ రేంజ్ లోనే భారీ ఏక్షన్ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమాపై ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ సమాచారం తెలుస్తుంది.

త్రివిక్రమ్ ఈ సినిమా కోసం కేజీఎఫ్, విక్రమ్ సినిమాల ఫేమ్ అన్బు బ్రదర్ ని ఏక్షన్ సీక్వెన్స్ లు కోసం తీసుకున్న సంగతి తెలిసిందే. మరి వారితో ఆల్రెడీ కొన్ని సాలిడ్ సీన్స్ ప్లాన్ చేయగా ఇప్పుడు అయితే ఓ నైట్ ఎపిసోడ్ ని ప్లాన్ చేస్తున్నారట. దీని కోసం కూడా భారీ సెట్టింగ్స్ వేసి దాదాపు కొన్ని రోజులు పాటు అలా నైట్ షూట్ కొనసాగించనున్నారని తెలుస్తుంది.

ఈ ఒక్క సినిమాకి మాత్రం త్రివిక్రమ్ చాలా పర్టిక్యులర్ గా తీసుకుని సీన్స్ ని డిజైన్ చేయించుకుంటున్నారని టాక్. మరి ఆ సీన్స్ ఎలా ఉంటాయో చూడాలి. ఇక నెక్స్ట్ అయితే మహేష్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తో ఓ పాన్ వరల్డ్ సినిమా చేస్తుండగా ఇది భారీ ఏక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ గా అయితే తెరకెక్కనుంది. అలాగే ఈ సినిమా వచ్చే ఏడాది జూన్ లోపు టేకాఫ్ కానుంది.