టాలీవుడ్ ఇండస్ట్రీలో డైరెక్టర్ గా మంచి గుర్తింపు పొందిన హరీష్ శంకర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అసిస్టెంట్ డైరెక్టర్ గా తన కెరీర్ ప్రారంభించిన హరీష్ శంకర్.. రవితేజ జ్యోతిగా జంటగా నటించిన షాక్ సినిమాకి మొదటిసారిగా దర్శకత్వం వహించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడటంతో హరీష్ శంకర్ కి మొదటి సినిమాతో పెద్ద షాక్ తగిలింది. ఆ తర్వాత చాలా కాలం వరకు హరీష్ శంకర్ కి దర్శకత్వం చేసే అవకాశాలు రాలేదు. షాక్ సినిమా విడుదలైన ఐదేళ్ల తర్వాత మళ్లీ రవితేజ హీరోగా నటించిన మిరపకాయ సినిమాకి దర్శకత్వం వహించి ఆ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు.
ఆ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన గబ్బర్ సింగ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు. ఆ తర్వాత ఎన్టీఆర్ హీరోగా నటించిన రామయ్య వస్తావయ్య సినిమాకి దర్శకత్వం వహించి మళ్లీ ఫ్లాప్ అందుకున్నాడు. గద్దల కొండ గణేష్ సినిమా తర్వాత ఇప్పటివరకు హరీష్ శంకర్ డైరెక్షన్లో ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. ఇదిలా ఉండగా గత వారం రోజులుగా హరీష్ శంకర్ కి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఒక స్టార్ హీరో హరీష్ శంకర్ ని దారుణంగా అవమానించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
చాలాకాలంగా వరుస ప్లాపులు అందుకుంటున్న ఆ స్టార్ హీరోతో హరీష్ శంకర్ ఒక సినిమా కూడా చేశాడు. అయితే ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. ఇక ఆ సినిమా షూటింగ్ సమయంలో హరీష్ శంకర్ హీరోతో మాట్లాడుతూ ఇప్పుడు తీస్తున్న సినిమా ఎలాగో హిట్ అవుతుంది. ఆ తర్వాత కూడా నేను మీకు మరో హిట్ ఇస్తాను అని చెప్పగానే ఆ స్టార్ హీరో ఇగో హర్ట్ అయ్యి నువ్వేంటి నాకు హిట్ ఇచ్చేది.. ఇండస్ట్రీలో నీ రేంజ్ ఏంటి నా రేంజ్ ఏంటి అని అవమానించినట్లు తెలుస్తోంది. అయితే ఆ స్టార్ హీరోకి ఉన్న పలుకుబడి కారణంగా హరీష్ శంకర్ ఏం మాట్లాడకుండా నోరు మూసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయినట్లు తెలుస్తోంది.