చికిత్స కోసం దక్షిణ కొరియాకు వెళ్లిన సమంత… ఆందోళనలో అభిమానులు!

సమంత ప్రస్తుతం మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న విషయం మనకు తెలిసిందే.ఇలా మయో సైటీసెస్ వ్యాధితో బాధపడుతూ ఈమె అమెరికాలో కొద్దిరోజుల పాటు ఈ వ్యాధికి చికిత్స తీసుకున్నారు. ఇలా అమెరికాలో కొన్ని రోజులపాటు ఉన్నటువంటి సమంత తిరిగి ఇండియా చేరుకొని తను మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్నాననే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.ఇలా మయోసైటిస్ వ్యాధి గురించి తెలియడంతో అభిమానులు ఒక్కసారిగా ఆందోళన వ్యక్తం చేశారు.

ఇకపోతే సమంత బాధపడుతున్న వ్యాధి గురించి ఎంతోమంది స్పందించి తాను త్వరగా కోలుకోవాలని సినీ సెలబ్రిటీలు పెద్ద ఎత్తున ఆమెకు ధైర్యం చెబుతూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేశారు. ఇకపోతే సమంత ఇండియాలో చికిత్స తీసుకున్నప్పటికీ ఈమెకు పూర్తిగా నయం కాకపోవడంతో ఆయుర్వేద చికిత్స కోసం కేరళ వెళ్ళినట్లు కూడా వార్తలు వచ్చాయి.అయితే ఇండియాలో ఎక్కడ చికిత్స తీసుకున్న కూడా ఈమె ఆరోగ్య పరిస్థితి ఏమాత్రం మెరుపు పడకపోవడంతో సరైన చికిత్స కోసం విదేశాలకు వెళ్లినట్టు సమాచారం.

సమంత బాధపడుతున్న మయోసైటీస్ వ్యాధికి దక్షిణ కొరియాలో అధునాతన టెక్నాలజీ ఉపయోగించే చికిత్స చేస్తున్నారని తెలియడంతో సమంత దక్షిణ కొరియా వెళ్లారని సమాచారం. ఇలా ఈమె ఆరోగ్య పరిస్థితి రోజురోజుకు క్షీణించడంతో మెరుగైన చికిత్స కోసమే తాను దక్షిణ కొరియా వెళ్లారని తెలియడంతో అభిమానులు ఎంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.మరి సమంత గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త వైరల్ కావడంతో అభిమానులు ఈమె క్షేమంగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.