RRR Documentary: విడుదలైన వారానికే ఓటీటీ లోకి ఆర్ఆర్ఆర్‌ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!

RRR Documentary: టాలీవుడ్ దర్శకరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ మూవీ ఆర్ఆర్ఆర్. ఇందులో రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ లు కలిసిన నటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం వాళ్లు ఎంత కష్టపడ్డారు అన్న విషయాన్ని ఒక డాక్యుమెంటరీ రూపంలో విడుదల చేశారు డైరెక్టర్ రాజమౌళి. ఈ డాక్యుమెంటరీ ఇటీవలే డిసెంబర్ 20వ తేదీన థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ బిహైండ్ అండ్ బియాండ్ అనే పేరుతో ఈ డాక్యుమెంటరీని విడుదల చేశారు.

ఆర్ఆర్ఆర్ మూవీ జర్నీ గురించి ఈ మూవీలో చూపించారు. తాజాగా ఈ డాక్యుమెంటరీ మూవీ ఓటీటీ రిలీజ్ తేదీని రివీల్ చేశారు మూవీ మేకర్స్. ఈ డాక్యుమెంటరీ రిలీజ్ అయిన వారానికి అనగా ఈ నెల 27 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ లో స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు. ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే థియేటర్లో కేవలం అతి కొద్ది మంది మాత్రమే ప్రేక్షకులు ఈ డాక్యుమెంటరీని వీక్షించారు.

ఇప్పుడు ఓటీటీలో ఈ డాక్యుమెంటరీ ఎలాంటి స్పందనను రాబట్టుకుంటుందో చూడాలి మరి. కాగా 2022లో విడుదలైన ఈ సినిమా దాదాపుగా 1200 కోట్లకు పైగా కలెక్షన్స్ ని సాధించడంతో పాటు ఆస్కార్ అవార్డులను సైతం సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా అన్ని భాషల్లోనూ బ్లాక్ బాస్టర్ హిట్టుగా నిలిచింది. కొన్ని ఏరియాలలో నెలల తరబడి థియేటర్లలో ప్రదర్శితం అయ్యి సరికొత్త రికార్డులు కూడా సృష్టించింది.