RRR రైటర్ ని భయపెట్టిన “పుష్ప”.!

Pushpa_AlluArjun_FB_171221_1200

టోటల్ పాన్ ఇండియా సినిమా దగ్గర తెలుగు సినిమాకి గాని తమిళ హిందీ భాషల సినిమాలకి కూడా కొన్ని లార్జర్ థన్ లైఫ్ సినిమాలకి ఎంట్రీ ఇచ్చింది మాత్రం దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి అని చెప్పాలి. అయితే అప్పట్లోనే శంకర్ తన “రోబో” గేట్లు తెరిచారు అలాగే అక్కడ నుంచి పలు బాలీవుడ్ సినిమాలు కూడా వచ్చాయి కానీ సక్సెస్ రేట్ తగ్గింది.

దీనితో బాహుబలి సిరీస్ తర్వాత చాలా మార్పులు రావడంతో రాజమౌళి ఎరా స్టార్ట్ అయ్యింది. కాగా రాజమౌళి ఎంత గొప్పగా దర్శకత్వం వహించినా సినిమాకి కథే కీలకం మరి ఏ సినిమాకి కూడా రాజమౌళి తన సొంతంగా రాసుకున్నది లేదు. తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథలే రాజమౌళి సినిమాలు చేస్తాడు.

మరి అలా విజయేంద్ర ప్రసాద్ అందించిన కథతో చేసిన సినిమానే ట్రిపుల్ ఆర్(RRR). ఈ సినిమా భారీ రికార్డులు కొల్లగొట్టింది. అయితే ఇలాంటి సెన్సేషనల్ సినిమా కథ ఇచ్చిన దర్శకుడు పాన్ ఇండియా హిట్ “పుష్ప” చూసి భయపడ్డారట. తాను దర్శకుల కన్నా వారిలో ఉన్న రచయిలకి బాగా గౌరవం ఇస్తానని.

అదే విధంగా సుకుమార్ రైటింగ్ ని పుష్ప సినిమా చూస్తున్నపుడు నాకు వణుకు పుట్టింది అని ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో తాను తెలిపారు. దీనితో ఇలాంటి స్టార్ రైటర్ కి కూడా పుష్ప సినిమా వణికించింది అంటే పాన్ ఇండియా లెవెల్లో ఎందుకు అంత పెద్ద హిట్ అయ్యిందో మనం అర్ధం చేసుకోవచ్చు.