అవును.. బిగ్ బాస్ 3 కంటెస్టెంట్ పునర్నవి భూపాలం కూడా పెళ్లి పీటలెక్కబోతోంది. త్వరలోనే పెళ్లి కూతురు కాబోతోంది. ఇటీవల ఎంగేజ్ మెంట్ రింగ్ తొడుక్కొని ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన పున్ను… తాజాగా తన కాబోయే భర్త ఫోటోను కూడా షేర్ చేసి అందరినీ షాక్ కు గురి చేసింది.
తను పెళ్లి చేసుకోబోయేది ఎవరినో కాదు.. సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తినే. అతడి పేరు ఉద్భవ్ రఘునందన్. ఆయన కూడా నటుడే. రచయిత, ఫిలిం మేకర్ గా పని చేస్తున్నాడు.
అయితే.. అతడి గురించి ఇంకా పూర్తి వివరాలు తెలియనప్పటికీ.. అతడే ప్రపోజ్ చేస్తే పున్ను ఓకే చెప్పిందట. దీంతో వాళ్ల ఎంగేజ్ మెంట్ కూడా అయిపోయి ఉంటుందని రింగ్ చూస్తేనే తెలుస్తోంది.
అయితే.. తన పెళ్లి గురించి పూర్తి వివరాలు అక్టోబర్ 30న అంటే రేపు చెబుతానంటూ పోస్ట్ పెట్టింది. తనకు కాబోయే భర్త ఫోటో కూడా షేర్ చేసింది. నేను ఎస్ చెప్పాల్సి వచ్చింది. అతడే నాకు కాబోయే వాడు.. అంటూ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది.
మరోవైపు ఉద్భవ్ కూడా పున్నుతో కలిసి ఉన్న ఫోటోను తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేశాడు. తను ఎస్ చెప్పింది.. ఇక ఆగలేను. అక్టోబర్ 30న అన్ని వివరాలు వెల్లడిస్తాం.. అంటూ పోస్ట్ పెట్టాడు.
మొత్తం మీద పున్ను ఓ ఇంటిది అవుతున్నదన్న మాట. అది సరే కానీ.. రాహుల్ సిప్లిగంజ్ సంగతేంటి? అయితే.. బిగ్ బాస్ హౌస్ లో జరిగినదంతా ఉత్తుత్తేనా?