బిగ్‌బాస్ బ్యూటీ పునర్నవి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ ఉంటుందో అందరికీ తెలిసిందే. పిట్టగోడ, ఉయ్యాల జంపాల వంటి చిత్రాల్లో నటించి మంచి పేరే తెచ్చుకుంది. కానీ అంతగా ఎవ్వరూ గుర్తు పట్టేవారు కాదు. అయితే బిగ్ బాస్ షో పునర్నవి ఫేట్ మార్చింది. ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ రేంజ్‌లో క్రేజ్, ఫాలోయింగ్ వచ్చేసింది. బిగ్‌బాస్ షో తరువాత పునర్నవి రేంజ్ వంద రెట్లు పెరిగింది.
అలా వచ్చిన పేరును, క్రేజును సోషల్ మీడియా ద్వారా కాపాడుకుంటూ వస్తోంది. సోషల్ మీడియా ఫోటో షూట్లతో రచ్చ చేస్తూ ఉంటుంది. అలాగే ఆరోగ్య పరిరక్షణకు సంబంధించిన సూచనలు, తినాల్సిన ఫుడ్, చేయాల్సిన వ్యాయామాలు, యోగా ఇలా ఎన్నో విషయాల్లో తన ఫాలోవర్స్‌కు అవగాహన కలిగించేందుకు వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా పునర్నవి నెటిజన్లతో చిట్ చాట్ చేసింది.
తనకు బోర్ కొడుతోందని, ఎవరైనా ఏదైనా ప్రశ్నలు అడగండి.. సమాధానాలు చెబుతాను అని చెప్పుకొచ్చింది, ఇలా ఓపెన్ ఆఫర్ ఇవ్వడంతో ఫ్యాన్స్ రెచ్చిపోయారు. ఎవరికి ఇష్టమున్నవి వారడిగేశారు. అందులో ఓ నెటిజన్ మాత్రం ఏకంగా వాట్సప్ నంబర్ అడిగేశాడు. అతనికి పునర్నవి కూడా గట్టిగానే కౌంటర్ వేసింది. శివమణి సినిమాలోని నాగార్జున డైలాగ్, ఆ ఫోన్ నంబర్ వీడియోను షేర్ చేసింది. ఇది చూసిన జనాలు పున్ను తెలివి తేటలకు ఫిదా అవుతున్నారు.