పునర్నవికి కాబోయే వాడు ఎవరంటే.. ఫోటో షేర్ చేసిన పున్ను!

బిగ్ బాస్ బ్యూటీ పునర్నవి నిన్నటి నుంచి సోషల్ మీడియాను ఊపేస్తోంది, మొత్తానికి ఇది జరుగుతోందని చెబుతూ ఓ రింగ్ ఫోటోను షేర్ చేసింది. అయితే ఇందులో ఎన్నో అనుమానాలు తలెత్తాయి. పునర్నవి షేర్ చేసిన ఫోటోలో రెండు చేతులు మరీ తెల్లగా ఉండటంతో అవి రెండూ కూడా అమ్మాయి చేతులేనని కొందరు అభిప్రాయపడ్డారు. శ్రీముఖి ఉమెనియా అనే టాక్ షొ కోసం ఇదంతా చేస్తున్నారని ఇంకొందరు కామెంట్లు చేశారు.

Punarnavi Bhupalam Engaged with Udbhav Raghunandan
Punarnavi Bhupalam Engaged with Udbhav Raghunandan

అసలు పునర్నవికి ఎంగేజ్మెంట్ జరగలేదని కొందరు అన్నారు. కానీ తాజాగా పునర్నవి మరో ఫోటోను షేర్ చేసింది. అతడికి యస్ చెప్పాల్సి వచ్చిందని పేర్కొంది. ఉద్భవ్ రఘునందన్ అంటూ తనకు కాబోయే భర్త ఫోటోను షేర్ చేసింది. మిగతా విషయాలన్నీ రేపు ప్రకటిస్తాను అని తెలిపింది. అదే క్రమంలో రేపు శ్రీముఖి ఉమెనియా పునర్నవి ఎపిసోడ్ టెలీకాస్ట్ కానుంది. అందులోనే అన్ని వివరాలు చెప్పినట్టు కనిపిస్తోంది.

Punarnavi Bhupalam Engaged with Udbhav Raghunandan
Punarnavi Bhupalam Engaged with Udbhav Raghunandan

ఇక పునర్నవి చెప్పిన పేరు ప్రకారం సోషల్ మీడియాలో అతని ఫ్రొఫైల్ ప్రకారం అతనో రైటర్, యాక్టర్, ఫిల్మే మేకర్ అని తెలుస్తోంది. రానా, అమలాపాల్ ఇలా ఎంతో మంది సెలెబ్రెటీలతో ఫోటోలు దిగాడు. ఇక పునర్నవితో దిగిన ఫోటోను షేర్ చేస్తూ.. ఆమె యస్ చెప్పింది.. నాయిసీ.. రేపటి గురించి మీకు చెప్పాలని ఎంతో ఆత్రుతగా ఉంది.. అంటూ షేర్ చేశాడు. అయితే ఇది సినిమా ప్రమోషన్ కోసమై ఉంటుందని కొందరు నెటిజన్లు లైట్ తీసుకుంటున్నారు.