ఆదిపురుష్ సినిమాకి దారుణంగా నష్టాలొచ్చాయ్. అంతకు ముందు ప్రబాస్ నటించిన ‘సాహో’కీ ఇదే స్థాయిలో నష్టాలు చవి చూడాల్సి వచ్చింది. అలాగే, ‘రాధేశ్యామ్’ కూడా. బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాలు నష్టపోయినా ప్రబాస్ సినిమాలపై హైప్ తగ్గడం లేదు. ఆ హైప్ తగ్గించడం కూడా ప్రబాస్ చేతుల్లో లేదు.
నష్టాలొస్తున్నాయ్ అని ఎగ్జిబిటర్లు ఆందోళన చెందుతున్నా ప్రీ రిలీజ్ బిజినెస్ మాత్రం అంచనాల్ని మించివుంటాయ్. లో బడ్జెట్ సినిమాలు చేయాలనుకున్నా ప్రబాస్ వల్ల కావడం లేదు. ‘రాధేశ్యామ్’ తర్వాతే ప్రబాస్ అనుకున్నాడట తగ్గాలని. కానీ కుదరలేదట. ‘ఆదిపురుష్’ పరిస్థితి ఇలా వుంటే, ప్రస్తుతం ప్రబాస్ చేతిలో మరో రెండు భారీ బడ్జెట్ చిత్రాలున్నాయ్.
అవే ‘సలార్’, ‘ప్రాజెక్ట్ కె’ చిత్రాలు. ‘ప్రాజెక్ట్ కె’ ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటోంది. భారీ తారాగణంతో భారీ బడ్జెట్‌తో ప్యాన్ వరల్డ్ మూవీగా ఈ సినిమాని ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు.
ఇక, ‘సలార్’ గురించి చెప్పనే అక్కర్లేదు. ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ ఈ సినిమాకి దర్శకుడు. అయితే, ‘సలార్‌తో అన్నింటికీ సమాధానం చెబుతాడని ప్రబాస్ అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు.