టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ తాజాగా నటించిన చిత్రం అశోకవనంలో అర్జున కళ్యాణం. ఈ సినిమా మే 6న విడుదల కానున్న విషయం తెలిసిందే. విడుదల తేదీకి మరి కొద్ది రోజులే సమయం ఉండటంతో చిత్రబృందం ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది. ఇకపోతే ఈ ప్రమోషన్స్ లో భాగంగానే హీరో విశ్వక్ సేన్ చేసిన ఒక ఫ్రాంక్ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవ్వడమే కాకుండా పెద్ద దుమారాన్ని సృష్టించింది. హీరో విశ్వక్ సేన్ ఫిలింనగర్ రోడ్ లో వెళ్తూ ఉండగా అక్కడ ఒక వ్యక్తి వచ్చి పెట్రోలు పోసుకుని అంటించుకుంటున్నట్టుగా ఒక లెవల్లో హంగామా చేశాడు.
ఇక విశ్వక్ సేన్ తనకు కూడా ఏమీ తెలియదు అన్నట్టుగా జీవించేశారు. ఈ వ్యవహారం కాస్త పోలీసుల వరకూ వెళ్లింది. అయితే ఈ విషయంపై యాంకర్ దేవి నాగవల్లి డిబేట్ పెట్టారు. ఈ క్రమంలోనే విశ్వక్ సేన్, దేవి నాగవల్లి మధ్య మాటల యుద్ధం జరిగింది. అప్పుడు దేవి నాగవల్లి గెట్ అవుట్ ఫ్రమ్ మై స్టూడియో అంటూ కెమెరా ముందే దురుసుగా ప్రవర్తించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతే కాకుండా తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఇది ఒక హాట్ టాపిక్ గా మారింది. అయితే హీరో విశ్వక్ సేన్ పట్ల దేవి నాగవల్లి ప్రవర్తించిన తీరుపై అభిమానులు దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే కొందరు ఇది జర్నలిజమా అని ప్రశ్నించగా.. ఇంకొందరు అది నీ స్టూడియోనా..? అని ప్రశ్నిస్తున్నారు. మరి కొందరు అభిమానులు అది నీ స్టూడియో కాదు నువ్వు అందులో యాంకర్ గా పని చేస్తున్నారు అంటే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అదే విశ్వక్ సేన్ విషయంలో ఒక పెద్ద హీరోనో లేకుంటే ఒక పెద్ద రాజకీయ నాయకుడు ఉంటే నువ్వు ఇదే విధంగా మాట్లాడతావా? ఇదే విధంగా ప్రవర్తిస్తావా? అంటూ దేవి నాగవల్లి ని ప్రశ్నిస్తున్నారు. దేవి నాగవల్లి ప్రవర్తించిన తీరును తప్పు పట్టణమే కాకుండా ఆ విధంగా ప్రవర్తించకూడదు అని కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు. ఈ వివాదం ఇంకా ఎంత వరకు వెళుతుందో చూడాలి మరి.