ఆస్కార్ నిర్మాణ సంస్థతో నాని భారీ చిత్రం ఖరారు.!

టాలీవుడ్ సినిమా దగ్గర టైర్ 2 హీరోస్ లో ప్రస్తుతానికి టాప్ 1 హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది డెఫినెట్ గా నాచురల్ స్టార్ నాని అని చెప్పాల్సిందే. తనకి కమర్షియల్ సినిమా పడితే ఏ లెవెల్లో ఉంటుందో తన గత చిత్రం దసరా ప్రూవ్ చేయగా దీని తర్వాత నాని తన కెరీర్ 30వ చిత్రాన్ని అయితే కంప్లీట్ క్లాస్ సినిమాగా చేస్తున్నాడు.

ఇక ఈ సినిమా అనంతరం అయితే దర్శకుడు వివేక్ ఆత్రేయతో సినిమా ఉందని అందరికీ తెలిసిందే. వీరి నుంచి ఇప్పటికే ఓ సినిమా రాగ ఇది రెండో సినిమాగా ఇప్పుడు అనౌన్స్ చేశారు. అయితే ఈ చిత్రాన్ని ప్రముఖ భారీ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు బ్యాంక్రోల్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు.

ఇప్పటికే వీరి నుంచి ఆస్కార్ విన్నింగ్ చిత్రం ఆర్ ఆర్ ఆర్ ఉండడం దీని తర్వాత కూడా పవన్ కళ్యాణ్ తో ఓ సెన్సేషనల్ ప్రాజెక్ట్ ఇంకా ఓ సూపర్ హీరో చిత్రం సహా ఎన్నో సినిమాలు ఉండగా ఓ పాటుగా ఓ ఇంట్రెస్టింగ్ ఏక్షన్ డ్రామాగా అయితే దీనిని కూడా ఇపుడు అనౌన్స్ చేశారు.

అయితే నాని కూడా ఈ సినిమా పట్ల చాలా నమ్మకంగా ఉండగా ఈ అక్టోబర్ 23 నుంచి అయితే టేకాఫ్ కానుంది. ప్రస్తుతానికి అయితే ఈ బిగ్గెస్ట్ కాంబినేషన్ పై మంచి అంచనాలే నెలకొన్నాయి. కాగా మరిన్ని డీటెయిల్స్ అయితే ఈ 23 తర్వాత నుంచి బయటకి రానున్నాయి.