లేటెస్ట్ : “నాని30” టైటిల్ ఇదే..మళ్ళీ వర్కౌట్ అయ్యేలా ఉందిగా

ఈ ఏడాది టాలీవుడ్ దగ్గర భారీ హిట్ అయ్యిన చిత్రాల్లో తన కెరీర్ లోనే మాస్ హిట్ అయినటువంటి చిత్రం “దసరా” కూడా ఒకటి. కాగా ఈ చిత్రం నాని కెరీర్లో 29వ సినిమా కాగా నాని కెరీర్ లో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గా అయితే నాని 30వ సినిమాని కొత్త దర్శకుడు శౌర్యువ్ అలాగే కొత్త నిర్మాణ సంస్థ వైరా క్రియేషన్స్ అనే దానిని టాలీవుడ్ కి నాని పరిచయం చేస్తున్నాడు.

అయితే ఈ చిత్రంపై మొదటి నుంచి మంచి పాజిటివ్ బజ్ ఉంది. పైగా నాని ఎమోషనల్ హిట్ జెర్సీ తర్వాత మళ్ళీ నాన్న సెంటిమెంట్ తో ఈ చిత్రం వస్తుండడంతో మూవీ లవర్స్ లో మరింత ఆసక్తి నెలకొంది. ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రం కి స్టార్టింగ్ లోనే నాన్న రిలేటెడ్ గా టైటిల్స్ వినిపించగా ఇపుడు ఫైనల్ గా మేకర్స్ ఆ సినిమా టైటిల్ ని రివీల్ చేశారు.

అయితే ఈ చిత్రానికి మేకర్స్ “హాయ్ నాన్న” అనే టైటిల్ ని పాన్ ఇండియా అనౌన్సమెంట్ తో అయితే అందించారు. మరి హిందీలో హాయ్ పాపా గా అయి చిత్రం రానుంది. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్ ని కూడా రిలీజ్ చేయగా నాని నటనతో ఇది మంచి ఎమోషనల్ గా అనిపిస్తుంది.

దీనితో మరోసారి నాన్న సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయ్యేలా అనిపిస్తుంది అని చెప్పాలి. కాగా ఇందులో మృణాల్ ఠాకూర్ కూడా కనిపిస్తుండగా హీశం సంగీతం బాగుంది. మొత్తంగా అయితే డిసెంబర్ 21న ఈ చిత్రం ఏదో మ్యాజిక్ చేస్తుంది అని చెప్పవచ్చు. 
Hi Nanna Telugu Glimpse | Nani | Mrunal Thakur | Shouryuv | Hesham Abdul Wahab | Sanu John Varghese